WhatsApp లో కొత్త మెసేజ్ ట్రాన్స్ లేషన్ మరియు బోటమ్ కాలింగ్ ఫీచర్స్ వచ్చాయి.!

WhatsApp లో కొత్త మెసేజ్ ట్రాన్స్ లేషన్ మరియు బోటమ్ కాలింగ్ ఫీచర్స్ వచ్చాయి.!
HIGHLIGHTS

WhatsApp లో మెసేజ్ ట్రాన్స్ లేషన్ మరియు బోటమ్ కాలింగ్ ఫీచర్స్ వచ్చాయి

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అలరిస్తూనే ఉంది

ఈ ఫీచర్ యూజర్ లు అందుకునే మెసేజ్ లను అనువైన భాషలోకి తర్జుమా చేసి అందిస్తుంది

WhatsApp లో మెసేజ్ ట్రాన్స్ లేషన్ మరియు బోటమ్ కాలింగ్ ఫీచర్స్ కొత్తగా వచ్చాయి. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అలరిస్తూనే ఉంది. ఇదే దారిలో ఇప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ ను మరింత పెంచేందుకు ఈ కొత్త ఫీచర్స్ ను తీసుకు వస్తోంది. ఇటీవల వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ ను తీసుకు వచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఈ మరో రెండు కొత్త ఫీచర్స్ లను తెచ్చింది. ఈ ఫీచర్స్ ముందుగా బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులో ఉంచిన వాట్సాప్, ఇప్పుడు కొందరు యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది.

WhatsApp కొత్త ఫీచర్స్

వాట్సాప్ లో కొత్త అప్డేట్ తో మెసేజ్ లను ఆటోమాటిగ్గా కోరుకున్న లాంగ్వేజ్ లోకి తర్జుమా చేసుకునేల ఈ కొత్త ట్రాన్స్ లేషన్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో, ఇతర భాషల్లో యూజర్ లు అందుకునే మెసేజ్ లను వారికి ప్రియమైన లేదా అనువైన భాషలోకి తర్జుమా చేసి అందిస్తుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.15.8 తో ఈ ఫీచర్ ను అందించింది. ఈ విషయాన్ని wabetainfo నివేదించింది మరియు ఈ ఫీచర్ ను వివరించే స్క్రీన్ షాట్ లను కూడా తన అధికారిక X అకౌంట్ నుండి షేర్ చేసింది.

WhatsApp new features
WhatsApp new features

ఇక రెండవ ఫీచర్ ఫీచర్ విషయానికి వస్తే, వాట్సాప్ లో కొత్త బోటమ్ కాలింగ్ కోసం కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.12.14 తో కాలింగ్ స్క్రీన్ కోసం కొత్త ఇంటర్ ఫేజ్ ను పరిచయం చేసింది. ఇది బోటమ్ కాలింగ్ కు కొత్త సొబగులు దిద్దుతుంది. ఈ ఫీచర్ ను ఇప్పుడు అందరూ యూజర్లకు విరివిగా విస్తరిస్తునట్లు కూడా తెలుస్తోంది.

ఈ కొత్త అప్డేట్ లతో వాట్సాప్ కాలింగ్ లో కనిపించే స్క్రీన్ లో కనిపించే బటన్స్ మరింత పెద్దగా మరియు బ్రైట్ గా కనిపిస్తాయని చెబుతోంది. ఇదే కాదు, ఈ స్క్రీన్ సెమీ ట్రాన్స్పరెంట్ బ్యాగ్రౌండ్ లో కనిపిస్తుందని కూడా ఈ రిపోర్టులో తెలిపింది. ఇక ఇటీవల వచ్చిన కొత్త ఫీచర్ విషయానికి వస్తే, వాట్సాప్ బీటా టెస్టర్స్ కోసం కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్ క్రిప్షన్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్లకు వచ్చిన వాయిస్ మెసేజ్ లను వారికి అనువైన లాంగ్వేజ్ లోకి తర్జుమా చేసుకుని వినే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo