WhatsApp UPI payment అందరికీ అందుబాటులో: ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి

WhatsApp UPI payment అందరికీ అందుబాటులో: ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి
HIGHLIGHTS

WhatsApp payment సర్వీస్ ను 2018 లో ప్రవేశపెట్టారు

ఈ ఫీచర్ ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ ద్వారా మెసేజీని పంపినంత సులభంగా డబ్బును కూడా పంపవచ్చు.

WhatsApp payment సర్వీస్ ను 2018 లో ప్రవేశపెట్టారు కాని ఇది అందరికీ అందుబాటులో లేదు. Paytm లేదా Google Pay మాదిరిగానే, WhatsApp payment UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఉపయోగించి డబ్బును ట్రాన్స్ ఫర్  చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

 “ఈ రోజు నుండి, భారతదేశం అంతటా ప్రజలు వాట్సాప్ ద్వారా డబ్బును పంపగలరు. ఈ సురక్షిత చెల్లింపుల అనుభవం సందేశాన్ని పంపినట్లే డబ్బును బదిలీ చేస్తుంది. వ్యక్తిగతంగా నగదు మార్పిడి చేయకుండా లేదా లోకల్ బ్యాంకుకు వెళ్లకుండా ప్రజలు సురక్షితంగా కుటుంబ సభ్యునికి డబ్బు పంపవచ్చు లేదా వస్తువుల ధరను దూరం నుండే షేర్ చెయ్యవచ్చని ”. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, వాట్సాప్ పేర్కొంది.

అంటే, మీరు ఇప్పుడు మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా మెసేజీని పంపినంత సులభంగా డబ్బును కూడా పంపవచ్చు. దీని కోసం ఎటువంటి ఫీజు కూడా లేదు. అంతేకాదు దీనికి 140 కంటే ఎక్కువ బ్యాంకులు మద్దతు ఇస్తున్నాయి.

వాస్తవానికి, UPI పేమెంట్స్ కోసం 160 బ్యాంకులు మద్దతు ఇస్తున్నాయి మరియు పంపినవారు మరియు రిసీవ్ చేసుకునే వారు ఇద్దరి అకౌంట్ UPI లింక్డ్ బ్యాంక్ ఖాతా ఉంటే, వారు డబ్బు పంపించవచ్చు మరియు స్వీకరించవచ్చు.

వాట్సాప్ ఉపయోగించి డబ్బు ఎలా పంపాలి

  • డబ్బు పంపడానికి, వినియోగదారులు చాట్ విండోలోని అటాచ్మెంట్ చిహ్నంపై క్లిక్ చేయాలి. కాంటాక్ట్స్ , మీడియా, లొకేషన్ మొదలైనవాటిని పంపడానికి ఉపయోగించేది ఇదే).
  • ఇక్కడ, payments అనే ఎంపికపై క్లిక్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారి వాట్సాప్‌లో పేమెంట్స్ ప్రారంభించకపోతే, దాన్ని సెటప్ చేయడానికి మీరు వారికి మెసేజీని పంపవచ్చు.
  • మీ స్వంత పేమెంట్స్ ను సెటప్ చేయడానికి, సెట్టింగులకు వెళ్లి, ఆపై పేమెంట్ ఎంచుకుని, స్క్రీన్ సూచనలను అనుసరించండి.
  • మీరు మరియు రిసీవర్ చెల్లింపును సెటప్ చేసిన తర్వాత, మీరు డబ్బు పంపగలరు. ఇది ఒక అటాచ్మెంట్ పంపినంత సులభం.
  • మీకు ఇప్పటికే UPI ID ఉంటే, లావాదేవీ పూర్తయ్యే ముందు మీ UPI PIN  నమోదు చేయమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు.
Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo