మెటా యాజమాన్యం లోని వాట్సాప్ లో కొత్త ఫీచర్ అందించింది. ఈ కొత్త ఫీచర్ యూజర్లకు వారు కోరుకున్న చాటింగ్ ను పాస్వర్డ్ తో లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ తో యూజర్ ప్రైవసీని మరింత పరిరక్షించే అవకాశం వాట్సాప్ అందించింది. ఇటీవల యూజర్లు అందుకుంటున్న ఇంటర్నేషన్ స్కామ్ కాల్స్ కోసం కూడా కొత్త ఫీచర్ ని బీటా వెర్షన్ లో అందించింది. వాట్సాప్ లో జత చెయ్యబడిన చాట్ లాక్ ఫీచర్ ఏమిటో తెలుసుకోండి.
వాట్సాప్ చాట్ లాక్ పేరుతో వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ తో మీరు మీ అత్యంత పర్సనల్ చాట్ ను లాక్ చేసిన ఫోల్డర్ లో దాచుకోవచ్చు. లాక్ చేసిన ఈఆ చాటింగ్ ను చూడాలంటే, మీ ఫోన్ యొక్క పిన్ లేదా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కలిగి వారు మాత్రమే చూసే వీలుంటుంది. ఈ ఫీచర్ తో లాక్ చేసిన చాట్స్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా ఆటొమ్యాటిక్ గా హైడ్ చేస్తుంది.
ఈ ఫీచర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే మీకు అత్యంత విలువైన మరియు ఇతరులు చూడకూడదు అని మీరు కోరుకునే చాట్ ను లాక్ చేసి దాచుకోవచ్చు మరియు మీకు నచ్చినప్పుడు చూడవచ్చు. దీనితో అనుకోకుండా మీ ఫోన్ మీ ఫ్యామిలీ లేదా ఇతరుల చేతిలో వున్నప్పుడు మీకు వచ్చే పర్సనల్ చాట్ ని వారు చూసే అవకాశం ఉండదు.
చాట్ లాక్ ని మీ ఫోన్ లో సెట్ చేసుకోవడానికి కాంటాక్ట్ పైన ట్యాప్ చేసి Chat Lock ను ఎనేబుల్ చెయ్యడం ద్వారా ఈ ఫీచర్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను వాట్సాప్ రోల్ అవుట్ చేసింది.