ఇక WhatsApp నుండి యానిమేటెడ్ స్టికర్స్
WhatsApp ప్రస్తుతం తన వినియోగదారులకి యానిమేటెడ్ స్టిక్కర్లని అందించడం కోసం పని చేస్తోంది. ఇది iOS, వెబ్ యూజర్లు మరియు Android యూజర్ల కోసం దీన్ని తీసుకురానుంది. ఇటీవల, టిప్స్టర్ WABetaInfo ఈ మూడు ప్లాట్ఫారమ్ల పైన ఉపయోగించిన కొన్ని చిత్రాలు మరియు స్క్రీన్షాట్లను కూడా షేర్ చేసింది. అయితే, సంస్థ ప్రస్తుతం దీన్ని పూర్తిగా అందించే దిశగా పనిచేస్తునట్లు చెప్పింది. అంటే దీనర్థం పూర్తిగా డెవలప్ అయ్యేవరకు వినియోగదారులు చూడలేరు.
త్వరలో రానున్న WhatsApp అప్డేటులో ఈ ఫిచరును తీసుకురానుంది, అని టిప్స్టర్ వివరిస్తున్నారు. ఈ యానిమేటెడ్ స్టికర్లు GIF నుండి భిన్నంగా ఉంటాయి. కొన్ని సెకన్ల ప్లే తర్వాత GIF నిలిచిపోతాయి, కానీ యానిమేటెడ్ స్టిక్కర్లు నిరంతరంగా నడుస్తూనే ఉంటాయి. WhatsApp లో స్టికర్ ప్యాక్ల ద్వారా వినియోగదారులకు ఈ యానిమేటెడ్ స్టిక్కర్లు పొందుతారని కూడా తెలుస్తోంది. అంటే, మీరు సాధారణ స్టిక్కర్లను డౌన్లోడ్ చేయడంలాగానే, ఈ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్లను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యానిమేటెడ్ స్టిక్కర్లు ప్రివ్యూ విభాగంలో మరియు చాట్ ఎంపికలో కనిపిస్తాయి.
WABetaInfo రిపోర్ట్ ప్రకారం, WhatsApp ఇలాంటి యానిమేటెడ్ స్టిక్కర్స్ గురించి చేస్తున్నఅప్డేట్, ప్రస్తుతం టెస్టింగ్ కోసం నడిపించబడుతోంది మరియు అతి త్వరలోనే దీన్ని అధికారికంగా రోల్అవుట్ చేయవచ్చని అంచనాలను అందిస్తోంది. ఇక వాట్స్ ఆప్ ఇన్స్టాంట్ మెసేజి మల ప్రారంభించబడింది. ఈ తక్షణ సందేశ ఆప్ ఫిచర్ iOS మరియు Android ప్లాట్ఫారమ్ల కోసం తిరిగి అందచేయబడింది. ఇది WhatsApp వెబ్ వెర్షన్ లో కూడా చేర్చబడుతుంది. టిప్స్టర్ ప్రకారం, ఈ ఫీచర్లన్నీ కూడా మూడవ పార్టీ స్టిక్కర్ మద్దతుతో వస్తాయి.