వాట్స్ అప్ కు encryption సపోర్ట్ వస్తుంది అని రిపోర్ట్స్. వాయిస్ కాల్స్ అండ్ గ్రూప్స్ మెసేజెస్(standard messages కు ఆల్రెడీ ఎన్క్రిప్షన్ ఉంది వాట్స్ అప్ లో)కు ఈ ఎన్క్రిప్షన్ రానుంది అని చెబుతుంది The Guardian.
ఆల్రెడీ ఇది ఆపిల్ ప్లాట్ఫారం డివైజెస్ కు ఉంది. ఆండ్రాయిడ్ కు మాత్రం ఇంకా రాలేదు. అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏమిటి? ఎందుకు ఇది? అనే ప్రశ్నలు వస్తున్నాయా?
సింపుల్ గా చెప్పాలంటే ఇది సెక్యురిటీ ఫీచర్. అంటే ప్లెయిన్ గా ఉన్న text ను random గా అటు ఇటు మార్చి పంపిస్తుంది అవతల వ్యక్తి కి.
ఎందుకు ఇలా చేయటం?
మనకు పెద్దగా అవగాహన లేని హాకింగ్ విషయాలు చాలా హల్ చల్ చేస్తున్నాయి ఇంటర్నెట్ ప్రపంచంలో. అయితే ఇవి ఎప్పుడూ వినేవే కాని క్లారిటీ గా ఎంటవి అనేది తెలియదు.
మీరు మెసేజ్ send చేస్తే దానిని హాకర్స్ మధ్యలో పట్టుకుని text ఏంటో చూడగలరు.మనం అంత ఇంపార్టంట్ విషయాలను ఏమి మాట్లాడుకుంటామని అనుకుంటారు కాని మనల్ని ఎవరైనా సిక్రెట్ గా చూస్తుంటే ఎలా ఉంటుందో అదే ఇది కూడా.
ఎన్క్రిప్షన్ సపోర్ట్ ఉంటే మీరు పంపే మెసేజ్ ను డేటా స్టీలింగ్ పనిలో ఉండే వారు ఎవరూ చూడలేరు. టెక్నికల్ గా చెప్పాలంటే.. మెసేజ్ ను send చేసే వారు text ను పబ్లిక్ key తో encrypt చేయగలరు కాని దానిని decrypt చేసి చదవాలి అంటే మెసేజ్ రిసీవర్ మాత్రమే చేయగలరు. decrypt చేయటానికి ప్రైవేట్ key రిసీవర్ దగ్గర మాత్రమే ఉంటుంది.
అయితే కంప్లీట్ edge కు వెళ్లి చెప్పాలంటే దీనిని కూడా బ్రేక్ చేయగలరు కాని అందుకు చాలా ఎక్కువ సమయం మరియు డబ్బులు అవసరం ఉంటుంది. అంత స్థాయిలో వెచ్చించి ఎన్క్రిప్షన్ డేటా ను చూడటం అనేది ఇంపాసిబుల్ దాదాపు.
ఇప్పుడు ఎన్క్రిప్షన్ పై గూగల్ మెయిల్, snapchat, ఫేస్ బుక్ మెసెంజర్( కాల్స్ ) ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా FBI తో ఆపిల్ కంపెని ఒక క్రైమ్ కేస్ కు సంబందించిన వ్యక్తి డేటా ను ఇవ్వాతనికి నిరాకరించింది. ఎన్క్రిప్షన్ సపోర్ట్ కలిగి ఉంటే డేటా ఎవరూ ఏమి చేయలేరు. కాల్ or text రిసీవర్ మాత్రమే చూడగలరు. అంటే గవర్నమెంట్ టాపింగ్ చేసి డేటా ను తీసుకోగలదు కాని దాని నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదు. అంటే టాపింగ్ కూడా పనిచేయదు ఎన్క్రిప్షన్ ఉంటే.