ఇంటర్నేషనల్ కాల్స్ స్కామ్ పైన క్లారిటీ ఇచ్చిన వాట్సాప్..!

Updated on 16-May-2023
HIGHLIGHTS

వాట్సాప్ పై వస్తున్న ఇంటర్నేషల్ కాల్స్ పైన వాట్సాప్ తొలి సారిగా స్పందించింది

యూజర్ల కంప్లైట్స్ పైన స్పందించిన వాట్సాప్

ఇంటర్నేషల్ కాల్స్ గురించి క్లారిటీ ఇచ్చింది

వాట్సాప్ పై వస్తున్న ఇంటర్నేషల్ కాల్స్ పైన వాట్సాప్ తొలి సారిగా స్పందించింది. యూజర్ల సెక్యూరిటీకి మరియు ప్రైవసీకి పెద్ద పీట వేసే వాట్సాప్ లో గత కొంత కాలంగా వస్తున్న మెసపొరిత కాల్స్ ను గురించి రిపోర్ట్ చేస్తున్న యూజర్ల కంప్లైట్స్ పైన స్పందించిన వాట్సాప్, ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది. 

వాట్సాప్ లో వస్తున్న ఇంటర్నేషనల్ కాల్స్ ను గురించి చెబుతూ, వాట్సాప్ ను తప్పుగా ఉపయోగించే అవకాశం లేకుండా చూసేందుకు అందించిన బ్లాక్ & రిపోర్ట్ ను ఉపయోగించి ఈ సమస్య ను గురించి వెల్లడించ వచ్చని మరియు యూజర్ల ప్రైవసీ ని పరిరక్షించేందుకు ఈ ఫీచర్ చాలా కాలంగా అందుబాటులో ఉన్నట్లు గుర్తు చేసింది. 

అయితే, వాట్సాప్ లో మిస్డ్ కాల్ ఇవ్వడాన్ని కొత్త మార్గంగా స్కామ్ యూజర్లు ఎంచుకున్నట్లు వాట్సాప్ చెబుతోంది. ఎవరైతే ఈ మిస్డ్ కాల్ నంబర్ పైన కాల్స్ లేదా మెసేజ్ లను పంపించే ప్రయత్నం చేస్తారో, వారిని టార్గెట్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. అందుకే, ఈ సమస్యను గుర్తించి దీన్ని పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (AI) మరియు మెషిన్ లెర్ణింగ్ (ML) లను రంగంలోకి దించినట్లు తెలిపింది. 

ఈ చర్యతో దాదాపు 50% వరకు ఈ స్కామ్ కాల్స్ ను కట్టడి చేసే యోచనలో వాట్సాప్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఇదే దారిలో ఈ సమస్య నుండి త్వరలోనే పూర్తి స్థాయి కంట్రోల్ ను చేసే ప్రయత్నం లో కూడా వాట్సాప్ వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :