Whatsapp: వాట్సాప్ కొత్త ఫీచర్లు నిరంతరం అందిస్తూనే వుంది. ఒకదాని తర్వాత ఒకటిగా యూజర్ కోసం కొత్త ఫీచర్ లను వాట్సాప్ అందిస్తూనే ఉంది. ఇతర లాంగ్వేజ్ లలో వచ్చిన మెసేజ్ లను ఆటోమాటిగ్గా ట్రాన్స్ లేట్ చేసే ట్రాన్స్లేట్ యువర్ మెసేజ్ ఫీచర్ ను తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు యానిమేటెడ్ ఎమోజీస్ ను కూడా అందిస్తోంది.
వాట్సాప్ కొత్త అప్డేట్ తో ఈ యానిమేటెడ్ ఎమోజీలను అందిస్తుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్ కొత్త అప్డేట్ 2.24.15.15 తో ఈ యానిమేటెడ్ ఎమోజీ లను అందిస్తుందని తెలిపింది. ఈ కొత్త యానిమేటెడ్ ఎమోజీల ద్వారా వాట్సాప్ యూజర్ అనుభూతిని మరింత గొప్ప మార్చాలని చూస్తోంది వాట్సాప్. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న సాధారణ ఎమోజీల మాదిరిగా కాకుండా ఈ యానిమేటెడ్ ఎమోజీలు కదులుతూ చక్కని హావభావాలతో ఆకట్టుకుంటాయి.
మీకు నచ్చిన వారికి లేదా సన్నిహితులకు ఈ ఎమోజీస్ ను పంపిస్తే ఇది మీ మనసులో మాటలను లేదా మీ ఫీలింగ్ ను ఇట్టే చెప్పేలా ఉంటాయి. వాట్సాప్ కొత్త అప్డేట్ తో ఈ కొత్త ఎమోజీస్ ను అందిస్తుంది.
Also Read: NASA Alert: గంటకు 29 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.!
ఇక వాట్సాప్ రీసెంట్ గా అందించిన ‘ట్రాన్స్లేట్ యువర్ మెసేజ్’ ఫీచర్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ ఫీచర్ లాంగ్వేజ్ అడ్డుగోడలను తొలగిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్ లను ఏ భాషలో ఉన్నా మీకు నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు. అంటే, వాట్సాప్ ఈ ఫీచర్ తో వచ్చిన మెసేజ్ ను మీరు ఎంచుకునే భాషలోకి ఆటొమ్యాటిగ్గా తర్జుమా చేసి అందిస్తుంది.