నేటి మన జీవితంలో వాట్సాప్ ఒక ముఖ్యమైన విషయంగా మారింది. సంస్థ తన వినియోగదారులలో ఆదరణను మరింతగా కొనసాగించడానికి కొత్త ఫీచర్లతో నిరంతరం అప్డేట్ చేస్తోంది. అలాగే, ఇప్పుడు వాట్సాప్ మరోసారి మీకు కొన్ని కొత్త ఫీచర్లను తెస్తోంది. WABetaInfo ద్వారా వచ్చిన వార్తల ప్రకారం, వాట్సాప్ 4 కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది, ఇవి అతి త్వరలోనే వినియోగదారులకు చేరుతాయి. ఆగష్టు లో జరిగిన గూగుల్ బీటా ప్రోగ్రామ్ లో 2.20.198.11 యాప్ యొక్క కొత్త వెర్షన్ ను వాట్సాప్ సమర్పించింది. అయితే ఈ కొత్త వెర్షన్ లో ఎటువంటి ఫీచర్లు రాబోతున్నాయో చూద్దాం ….
వాట్సాప్ లో ఇటీవల కొత్త రకం యానిమేషన్ స్టిక్కర్ వస్తోంది. ఈ ఫీచర్ వాట్సాప్ యొక్క తాజా వెర్షన్ లో లభిస్తుంది.
వాట్సాప్ తన కాలింగ్ ఫీచర్ ను మెరుగుపరచడానికి మెరుగైన ఇంటర్ ఫేస్ ను తీసుకువస్తోంది. ఇది వాట్సాప్ ఇంటర్ ఫేస్ ను మరింత గొప్పగా మరియు సులభంగా చేస్తుంది. ఈ అప్డేట్ వస్తే, పైన పేర్కొన్న అన్ని ఫీచర్ బటన్లు స్క్రీన్ దిగువన చూడవచ్చు.
వాట్సాప్ వినియోగదారులకు ఫోన్ స్పేస్ లేదా స్టోరేజ్ ను ఖాళీ చేయడానికి సహాయపడే ఒక ఫీచర్ ని పరీక్షిస్తోందని WABetaInfo ఇటీవల ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ తో స్టోరేజ్ ఎంత ఉపయోగించబడిందో చూడటానికి వినియోగదారులకు ఉపయోగపడుతుంది. స్టోరేజ్ అక్రమిస్తున్నపనికిరాని మీడియా ఫైళ్ళను తొలగించడం కూడా సులభం అవుతుంది. అలాగే, ఏదైనా చాట్ సులభంగా కనుగొనవచ్చు.
వాట్సాప్ యొక్క కొత్త వెర్షన్ లో, గ్రూప్ కాల్స్ కోసం వేర్వేరు రింగ్‌టోన్లు వస్తున్నాయి. వేర్వేరు గ్రూప్ కాల్స్ కోసం వేర్వేరు రింగ్ టోన్స్ సెట్ చేసుకునే వీలుంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.