WhatsApp : యూజర్ ప్రైవసీ మరింత పటిష్టం చేయడానికి కొత్త Privacy Checkup ఫీచర్ తెస్తోంది.!
కొత్త Privacy Checkup ఫీచర్ తెస్తోంది వాట్సాప్
యూజర్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ను మరింత పెంపొందించేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది
ఈ అప్ కమింగ్ ఫీచర్ ను సెక్యూరిటీ చెకప్ ఫీచర్ లో అందిస్తుంది
WhatsApp : యూజర్ ప్రైవసీ మరింత పటిష్టం చేయడానికి కొత్త Privacy Checkup ఫీచర్ తెస్తోంది వాట్సాప్. రీసెంట్ గా మెసేజ్ ట్రాన్స్ లేషన్ మరియు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ లను అందించిన వాట్సాప్, ఇప్పుడు యూజర్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ను మరింత పెంపొందించేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది.
WhatsApp అప్ కమింగ్ ఫీచర్
వాట్సాప్ యూజర్ల ప్రైవసీ మరింత పటిష్టం చేయడానికి వారికి తగిన అవకాశం ఇచ్చేలా కొత్త ప్రైవసీ చెకప్ ఫీచర్ ను తీసుకు వస్తోందని, wabetainfo తన X అకౌంట్ ను నుంచి తెలిపింది. ఈ అప్ కమింగ్ ఫీచర్ ను సెక్యూరిటీ చెకప్ ఫీచర్ లో అందిస్తుంది. యూజర్ వారి ఇన్ఫర్మేషన్ ఎవరు చూడాలో లేదా చూడకూడదో ఈ కొత్త ఫీచర్ తో చాలా సులభంగా రివ్యూ చేసుకొని సెట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ అప్ కమింగ్ అప్డేట్ 2.23.9.15 తో ఈ కొత్త ఫీచర్ ను అందిస్తుందని వాబీటాఇన్ఫో తన పోస్ట్ లో తెలిపింది. ఈ కొత్త అప్డేట్ గూగుల్ ప్లే స్టోర్ నుండి త్వరలో అందుబాటులోకి వస్తుందని, ఈ కొత్త అప్డేట్ ఈ కొత్త ఫీచర్ తో అందుతుందని కూడా ఈ రిపోర్టులో తెలిపింది. అంతేకాదు, ఈ ఫీచర్ ను వివరించే స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది.
కొత్త అప్డేట్ అందుకున్న తరువాత యూజర్లు వారి అకౌంట్ కు సంబంధించి మరియు అకౌంట్ ప్రైవసీకి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. యూజర్ తనను ఎవరు గ్రూప్ లో యాడ్ చెయ్యాలో ముందే ఎంచుకోవచ్చు. అంతేకాదు, ఎవరు ప్రొఫైల్ ఫోటో చూడవచ్చు, ఎవరు లాస్ట్ సీన్ స్టేటస్ చూడవచ్చు మరియు రీడ్ రెసిప్ట్స్ చూడవచ్చు అని సెట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ తన ప్రైవసీ మరింత ప్రైవేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Amazon Echo Show 5 స్మార్ట్ స్పీకర్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కారు చవకగా లభించనుంది.!
వాబీటాఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ను గమనిస్తే, ఇందులో కొత్త ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఈ కొత్త సెక్యూరిటీ చెకప్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ లో వుంది మరియు త్వరలో వాట్సాప్ అందించే కొత్త అప్డేట్ తో అందుతుంది.