వాట్స్ అప్ బీటా లో కొత్త వెర్షన్ వచ్చింది. కొత్త వెర్షన్ నంబర్ 2.16.189. దీనిలో కంపెని కొత్తగా Call back మరియు Voicemail ఫీచర్స్ ను ప్రవేశ పెట్టింది.
అయితే ఇవి ప్రస్తుతం బీటా users కు కనిపిస్తాయి. జనరల్ users కు కనిపించవు. ఏప్రిల్ నెలలో ఈ రెండు ఫీచర్స్ గురించి యాప్ ను translate చేసే ప్రయత్నాలలో ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది ఇన్ఫర్మేషన్.
వీటిని ఇప్పటికి ఇప్పుడు చూడాలనుకునే వారు ఈ లింక్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోగలరు కొత్త వెర్షన్ ను. ఈ apk verified అని చెబుతుంది అప్ లోడ్ చేసిన వెబ్ సైట్.
Call back అంటే ఏమిటి?
మీరు వాట్స్ అప్ లో ఎవరికైనా ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయకపోతే, మీ స్క్రీన్ పై, వారికీ తిరిగి ఫోన్ చేయటానికి call back అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Voice mail అంటే?
Call back తో పాటు రికార్డ్ వాయిస్ మెసేజ్ అనే మరో ఆప్షన్ కూడా ఉంటుంది.ఇదే వాయిస్ మెయిల్ గా పిలవబడుతుంది వాట్స్ అప్ చే. దీని పై టాప్ చేస్తే same మీరు చాటింగ్ విండో లో పంపే వాయిస్ మెసేజ్ లానే పనిచేస్తుంది.టాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని వాయిస్ రికార్డ్ చేసి unhold చేయగానే వెళ్తుంది మెసేజ్.
ఈ ఆప్షన్స్ అవతలి వారు ఓల్డ్ వెర్షన్ లో ఉన్నా పనిచేస్తాయి. అయితే ఫంక్షనాలటీ తెలిసిన తరువాత ఇవేమీ పెద్దగా ఇంటరెస్టింగ్ ఆప్షన్స్ కావని చెప్పాలి. మరి మీరేమంటారు. కామెంట్స్ లో తెలియజేయండి ఫేస్ బుక్ లో.