వాట్స్అప్ కొత్త స్కామ్: ఆదమరిస్తే కొంప కొల్లేరే..!

Updated on 25-May-2021
HIGHLIGHTS

నయా వాట్స్అప్ స్కామ్

కొత్త విషయాలు వెలుగులోకి

అనుకోకుండా వీడియో కాల్ వచ్చిందో జర భద్రం

అసలే కరోనా మహమ్మారితో ప్రజలు తంటాలు పడుతుంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సైబర్ నేరగాళ్లు మాత్రం తమ పంజా విసురుతూనే ఉన్నారు. కొత్తగా బయటపడిన నయా వాట్స్అప్ స్కామ్ తో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఒకటి కాదు రెండు చాలానే ట్రిక్స్ సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే ఎక్కువగా పరిమితమవుతుండగా స్నేహితులు మరియు సన్నిహితులతో పాటుగా సంప్రదించాడనికి మరియు తెలిసిన మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఆధారపడేది వాట్స్అప్ అని మనకు తెలుసు. అందుకే, సైబర్ నేరగాళ్లు వాట్స్అప్ ని ఎక్కువ టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

మీ వాట్స్అప్ నంబర్ కు తెలియని నంబర్ నుండి అనుకోకుండా వీడియో కాల్ వచ్చిందో జర భద్రం. ఎందుకంటే, ఆ నంబర్ తో వచ్చిన వీడియో కాలింగ్ ఒక న్యూడ్ గర్ల్స్ కనిపిస్తుంది మరియు కొంత సేపటికే ఆ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అంతే, ఇక అక్కడి నుండే మొదలవుతుంది అసలు కథ. మీరు కాల్ లిఫ్ట్ చేసిన తరువాత మీ ఈ కాలింగ్ స్క్రీన్ షాట్స్ తీసుకోబడతాయి. వాటిని మీకు పంపింపించి మీ నుండి డబ్బును గుంజే ప్రయత్నం చేస్తారు.

ఇదొక్కడే కాదు, అనుకుకోకుండా మా ఫ్రెండ్ నంబర్ కు బదులుగా మీ నంబర్ కు OTP నంబర్ పంపించామని తిరిగి మెసేజ్ చెయ్యమని కూడా మోసం చేసే స్కామ్ కూడా వాడుకలో ఉంది. ఇలా సైబర్ నేరగాళ్లు పలువిధాలుగా తమ అతితెలివి తేటలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మీకు కొత్త నంబర్ నుండి వచ్చే వాట్స్అప్ కాల్స్ మరియు వీడియో కాలింగ్ వంటి వాటితో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది.         

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :