WhatsApp New: యూజర్ అనుకూలత కోసం కొత్త message Drafts ఫీచర్ తెచ్చింది. ఎప్పటి కొత్త మరియు అనుకూలమైన ఫీచర్స్ ను తీసుకు వచ్చే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత పెంచుతుందిట. ఈ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్ మరియు iOS యూజర్స్ కోసం అందిస్తుంది.
వాట్సాప్ కొత్త పీడిత తో ఈ ఫీచర్ ను అందిస్తుంది. చాటింగ్ లేదా మెసేజింగ్ సమయంలో యూజర్ సగం టైప్ చేసిన మెసేజ్ లను సేవ్ చేసుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఈ మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్ తో అన్ ఫినిష్డ్ మెసేజ్ లను కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కొత్త అప్డేట్ ద్వారా ఫీచర్ అందుకున్న వారు అన్ ఫినిష్ మెసేజ్ ను వదిలేయగానే పైన టాప్ లో ఆ మెసేజ్ పాప్ అప్ ఆవుతుంది. అంటే, ఆ మెసేజ్ ఆవేశం ఉంటే తిరిగి యాడ్ చేసిన తర్వాత కంప్లీట్ మెసేజ్ ను సెండ్ చేసుకోవచ్చు.
మెసేజ్ టైప్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా పని వస్తే, సగం టైప్ చేసిన మెసేజ్ ను సేవ్ చేయడం లేదా డ్రాఫ్ట్ చేయడం వీలు పడక అవస్థలు ఎదుర్కొన్న యూజర్లకు ఈ కొత్త మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్ తో సహాయం చేస్తుంది. వాట్సాప్ అందించిన ఈ కొత్త ఫీచర్ యూజర్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వాట్సాప్ తెలిపింది.
Also Read: Price Cut: లేటెస్ట్ హానర్ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.!
వర్క్ మరియు పర్సనల్ లైఫ్ లో వాట్సాప్ ను ఎక్కువగా వినియోగించే యూజర్లకు ఈ కొత్త ఫీచర్ నిజంగా గొప్ప వరం అవుతుంది. ఇటీవల యూజర్ ప్రైవసీ పై ఎక్కువ శ్రద్ధ పెట్టిన వాట్సాప్ ఇప్పుడు యూజర్ కి అవసరమైన మరియు అనుకూలమైన ఫీచర్ ను తీసుకు వచ్చే పనిలో పడినట్లుగా కనిపిస్తోంది.