ఇటీవల, వాట్సాప్ గ్రూప్ కాల్ పరిమితిని నలుగురి నుండి ఎనిమిది మందికి పెంచుతున్నట్లు Whatsapp ప్రకటించింది. దీనికి సంబందించి ఫేస్ బుక్ యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో ప్రకటన కూడా చేసింది. ఈ మేరకు అనుకున్నట్లుగానే, ఇప్పుడు ఈ ఫీచరును ఈరోజు మీ వాట్సాప్ లో యాడ్ చేసింది. కాలపరిమితి లేని 50 మంది వరకు మెసెంజర్ రూములు ఉంటాయని ప్రకటించడం కూడా ఇందులో ఉంది.
COVID-19 కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నందున, వీడియో కాలింగ్ ద్వారా తమకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపునట్లు తెలుస్తోంది. అయితే, వాట్సాప్ లో ఇప్పటి వరకూ కేవలం నలుగురు మాత్రమే ఒకేసారి గ్రూప్ వీడియో కాలింగ్ చెస్ అవకాశం ఉండడం వలన వినియోగదారుల సలహా మరియు సూచనలు మేరకు వాట్సాప్ ఈ కొత్త ఫీచరును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి, ఇక మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఎక్కువ మంది ఒకేసారి గ్రూప్ కాల్ ద్వారా సన్నిహితంగా ఉండటానికి సహకరిస్తుంది.
ఈ కొత్త అప్డేట్ మీ ఫోన్ వాట్సాప్ లో పొందాలనుకుంటే, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ను యాప్ స్టోర్ కి వెళ్లి అప్డేట్ చెయ్యాల్సి వుంటుంది. అప్డేట్ చేసిన తరువాత వీడీయో కాలింగ్ లో ఒకేసారి 8 మందితో కాలింగ్ చేసే సౌలభ్యాన్ని పొందుతారు.