WhatsApp New Feature: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఈరోజు కొత్త అప్డేట్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ తో కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. నిన్నటి వరకు బీటా టెస్టర్స్ కోసం అందుబాటులో ఉన్న GIPHY Sticker Search ఫీచర్ ను ఈరోజు నుంచి వాట్సాప్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్ అప్డేట్స్ మరియు ఉపయోగం గురించి తెలుసుకుందామా.
వాట్సాప్ ఈరోజు కొత్త అప్డేట్ ను యూజర్స్ అందరి కోసం అందించింది. ఈ వాట్సాప్ కొత్త 2.24.17.79 అప్డేట్ ను యూజర్స్ కి అందించింది. ఈ కొత్త అప్డేట్ తో GIPHY Sticker Search ఫీచర్ ను జత చేసింది. ఈ కొత్త అప్డేట్ అందుకున్న యూజర్లు ఈ కొత్త ఫీచర్ ను చూడగలుగుతారు. ఈ అప్డేట్ ను యూజర్స్ అందరికీ అందించి మరియు కొత్త అప్డేట్ ను అప్డేట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వెబ్ బీటాఇన్ఫో తన X అకౌంట్ ను నుంచి వెల్లడించింది. ఈ కొత్త ట్వీట్ ద్వారా ఈ కొత్త అప్డేట్, ఫీచర్ మరియు ఇది ప్రయోజనాలు కూడా వివరించింది.
Also Read: Flipkart Big Deal: రూ. 22,999 ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఈ ఫీచర్ తో కొత్త గిఫీ సెర్చ్ మరియు స్టికర్ ట్రె నుంచి ఐటమ్స్ ను మూవ్ చేసే వీలుంటుంది. కొత్త అప్డేట్ తో ఈ గిఫీ ఇంటిగ్రేషన్ యాప్ లో స్టిక్కర్ లను సెర్చ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు, గిఫీ లైబ్రెరీ నుంచి అనేక ఆప్షన్ లను పొందడానికి కూడా వీలు కల్పిస్తుంది.
ఎమోషన్ లను గిఫీ రూపంలో ఎక్స్ ప్రెస్ చేసే వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు, ఎక్కువగా ఉపయోగించే స్టిక్కర్ లను త్వరగా యాక్సెస్ చేయడానికి వీలుగా స్టికర్ లను మూవ్ చేసి టాప్ లిస్ట్ చేసే వీలును కూడా ఈ ఫీచర్ తో అందిస్తోంది.