వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు.!

Updated on 08-May-2023
HIGHLIGHTS

యూజర్ల కోరిక మేరకు కొత్త ఫీచర్ తెచ్చిన వాట్సాప్

వాట్సాప్ కంపేనీయన్ మోడ్ ను తీసుకొచ్చింది

ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించవచ్చు

వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే, వాట్సాప్ కొత్త ఫీచర్ అంతగా ఉపయోగపడుతుంది మరియు యూజర్ల కోరిక మేరకు ఈ కూడా ఫీచర్ ను వాట్సాప్ యాప్ లో జత చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లకు ఒకే నంబర్ తో ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించవచ్చు. వినగానే మీకు ఆశ్చర్యం మరియు ఆనందం కలిగిందా. మరి ఈ కొత్త ఫీచర్ గురించి వివరంగా తెలుసుకోండి. 

వాట్సాప్ యూజర్ల కోరిక మేరకు కొత్తగా వాట్సాప్ కంపేనీయన్ మోడ్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒకేసారి నంబర్ తో నాలుగు ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించవచ్చు. ముందుగా మల్టి డివైజ్ ఫీచర్ ను అందించిన వాట్సాప్, ఇప్పుడు మరో మెట్టు పైకెక్కి కంపేనీయన్ మోడ్ ను కూడా అందించింది. 

ఈ కొత్త వాట్సాప్ కంపేనీయన్ మోడ్ ప్రత్యేకత మరియు వినియోగం విషయానికి వస్తే, ఈ ఫీచర్ ప్రైమరీ అకౌంట్ తో మరొక మూడు ఫోన్లను వాట్సాప్ అకౌంట్ కు జత చెయ్యవచ్చు. దీనితో మీరు, ఈ నాలుగు ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే, ప్రైమరీ ఫోన్ లో వాట్సాప్ అకౌంట్ ఎక్కువ రోజులు In-Active గా ఉంటే మాత్రం కంపేనీయన్ మోడ్ తో జతచేసిన మిగిలిన ముడు ఫోన్లలో మీ అకౌంట్ ఆటొమ్యాటిగ్గా లాగ్ అవుట్ అవుతుంది.

కంపేనీయన్ మోడ్ ద్వారా జత చేసిన అన్ని ఫోన్లలో కూడా మీడియా, మెసేజెస్ తో పాటుగా కాల్స్ వంటివి ఎండ్ -టూ- ఎండ్ ఎన్ క్రిప్టెడ్ గా ఉంటాయని వాట్సాప్ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :