WhatsApp New Feature: వాట్సాప్ లో రెగ్యులర్ గా స్టేటస్ అప్డేట్ చేసే వారికి గుడ్ న్యూస్.!
వాట్సాప్ లో రెగ్యులర్ గా స్టేటస్ పెట్టే వారికి గుడ్ న్యూస్
వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది
స్టేటస్ ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా చేసేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది
WhatsApp New Feature: వాట్సాప్ లో రెగ్యులర్ గా స్టేటస్ పెట్టే లేదా అప్డేట్ చేసే వారికి గుడ్ న్యూస్. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ మరియు ఫీచర్స్ అందించే వాట్సాప్, ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది. వాట్సాప్ లో యూజర్లు ఎక్కువగా ఇష్టపడే స్టేటస్ ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా చేసేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ ను రానున్న రోజుల్లో కొత్త అప్డేట్ ద్వారా అందిస్తుంది.
ఏమిటా WhatsApp New Feature ?
యూజర్లకు ఇష్టమైన లేదా నచ్చిన వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి వీలుగా కొత్త ‘Reshare Status Update’ ఫీచర్ ను తేవడానికి వాట్సాప్ పని చేస్తున్నట్లు, wabetainfo తెలిపింది. వాబీటాఇన్ఫో X అకౌంట్ నుంచి ఈ కొత్త ఫీచర్ గురించి స్క్రీన్ షాట్ తో సహా వివరాలు అందించింది. ఈ ట్వీట్ ప్రకారం, ఈ వాట్సాప్ అప్ కమింగ్ ఆండ్రాయిడ్ అప్డేట్ 2.24.20.9 తో ఈ కొత్త ఫీచర్ జత చేస్తుందట.
వాస్తవానికి, ఈ కొత్త అప్డేట్ ను గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా బీటా టెస్టర్ ల కోసం త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో తెలిపింది. ఇక ఈ ఫీచర్ విషయానికి వస్తే, ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను 24 గంటల వరకు మాత్రమే సెట్ చేసే అవకాశం వుంది. అయితే, ఈ అప్ కమింగ్ ఫీచర్ తో వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను 24 గంటలు ముగిసే లోపు తిరిగి షేర్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు వారికి ప్రీయమైన లేదా బాగా నచ్చిన వాట్సాప్ స్టేటస్ ను మళ్ళీ తిరిగి (Reshare) చేసుకోవచ్చు. వాట్సప్ స్టేటస్ ను ఉపయోగించే లేదా వారి భావాలు స్టేటస్ రూపంలో చూపడానికి ఇష్టపడే వారికి ఈ ఫీచర్ గుడ్ న్యూస్ అవుతుంది.
ఇక వాట్సాప్ లో రాబోతున్నట్లు చెబుతున్న మరిన్ని అప్ కమింగ్ ఫీచర్స్ విషానికి వస్తే, వాట్సాప్ త్వరలోనే స్టేటస్ అప్డేట్ లో కాంటాక్ట్స్ అప్డేట్ చేసే ఫీచర్ ను పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ను ఇప్పటికే బీటా టెస్టర్ ల కోసం రిలీజ్ చేసింది మరియు ఆండ్రాయిడ్ అప్డేట్ 2.24.20.9 తో బీస్ట్ టెస్టర్స్ కోసం ఈ ఫీచర్ ను రిలీజ్ చేసింది.