Whatsapp: స్పామ్ మరియు స్కామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ రంగంలోకి.!

Updated on 17-May-2023
HIGHLIGHTS

Whatsapp లో కొత్త ఫీచర్

వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కోసం న్యూ ఫీచర్

స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టె ఆలోచనలో వాట్సాప్

దేశవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లను విసిగిస్తున్న మరియు భయపెడుతున్న విషయం ఒక్కటే, అదే వాట్సాప్ లో స్పామ్ మరియు స్కామ్ కాల్స్. గత వారం వాట్సాప్ యూజర్లు ఇంటర్నేషనల్ కోడ్స్ తో కాల్స్ అందుకున్నట్లు అధిక సంఖ్యలో కంప్లయింట్స్ చేయగా, దీనికి స్పందించిన వాట్సాప్ AI మరియు ML ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టనున్నట్లు తెలిపింది. ఇప్పుడు దీనికి అనుగుణం గానే కొత్త ఫీచర్ ను చాలా వేగంగా తీసుకొచ్చింది. 

వాట్సాప్ యూజర్ల ప్రైవసీ మరియు సెక్యూరిటీ ని, మరింత మెరుగు పరచడానికి ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్  ప్రస్తుతం బీటా వెర్షన్ లో అందుబాటులో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా 'Unknown' నెంబర్ నుండి కాల్స్ అందుకుంటే కాల్ రింగ్ అవ్వకుండా సైలెంట్ అవుతుంది. దీనితో కాల్స్ అనుకోకుండా కాల్స్ అటెండ్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఈవిధంగా స్పామ్ మరియు స్కామ్ కాల్స్ బెడదను ప్రస్తుతానికి తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 

ఈ ఫీచర్ త్వరలోనే అందరికి అందుబాటులోకి వస్తుంది మరియు ఈ ఫీచర్ ను యూజర్లు ఎనేబుల్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడానికి వాట్సాప్ యాప్ 'సెట్టింగ్స్' లోకి వెళ్లి కాల్స్ కేటగిరిలో వుండే 'Unknown Calls' సైలెంట్ చేసే బటన్ ను నొక్కండం ద్వారా ఈ ఫిచర్ ను ఎనేబుల్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

అయితే, ఇక్కడ మీరు గమనించ వలసిన ముఖ్యమైన విషయం ఒకటి వుంది. మీరు సేవ్ చేసుకొని ఏ నెంబర్ నుండి కాల్ వచ్చినా కూడా మీకు రింగ్ వినబడదు. కాబట్టి, మీకు తెలిసిన మరియు కావాల్సిన ప్రతి నెంబర్ ను మీరు సేవ్ చేసుకోవలసి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, ఈ ఫీచర్ తో స్కామ్ కాల్స్ రావని కాదు అర్ధం, కాల్స్ వచ్చినా కాల్ సైలెంట్ లో ఉంటుంది కాబట్టి మీకు తెలియదు. మీరు కాల్స్ లిస్ట్ లోకి వెళ్ళినప్పుడు మీకు తెలియని నంబర్స్ ఉంటే కాల్ చెయ్యక పోవడం మంచిది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :