వాట్సప్ లో కొత్త అప్డేట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఏదో ఆషామాషీ అప్డేట్స్ లేదా ఫీచర్స్ తీసుకు వస్తోందా? అంటే, అదికూడా కాదు. ఇప్పుడు నెట్టింట్లో వచ్చిన కొత్త Whatsapp News వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు మరియు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందా అని కూడా అడుగుతారు. వాట్సాప్ నుండి రానున్న కాలంలో ఒరిజినల్ ఫోటోలు మరియు వీడియోలు షేరింగ్ చేసేలా కొత్త అప్డేట్ ను తీసుకు వస్తోంది వాట్సాప్. ఈ కొత్త అప్డేట్ గురించి ఇప్పటికే wabetainfo ఒక గ్లిమ్స్ కూడా ఇచ్చింది.
వాట్సాప్ లో రాబోతున్నట్లు చీకుతున్నా ఈ కొత్త అప్డేట్ గురించి వెబ్ బీటా ఇన్ఫో ముందుగా వెల్లడించింది. wabetainfo ప్రకారం, వాట్సాప్ యొక్క అప్ కమింగ్ అప్డేట్ 2.23.18.12. తో ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది. ముందుగా ఈ 2.23.18.12. అప్డేట్ బీటా వెర్షన్ ను గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ లో అందిస్తుంది మరియు తరువాత మొత్తం యూజర్లకు అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ కొత్త అప్డేట్ అందుకున్న యూజర్లు ఎటువంటి షింక్ అడ్డంకి లేకుండా ఇమేజ్ మరియు వీడియోలను ఉన్నవి ఉన్నట్లుగా ఒరిజినల్ సైజులో షేర్ చేసే వీలుంటుంది.
ఈ అప్ కమింగ్ అప్డేట్ యొక్క ఫీచర్స్ ను కూడా ఈ నివేదిక అందించింది. ఈ వాట్సాప్ అప్ కమింగ్ ఫీచర్ పైన ప్రస్తుతం వాట్సాప్ పని చేస్తోంది మరియు ఈ ఫీచర్ తో ఇమేజ్ మరియు వీడియో షేరింగ్ అనుభూతిని పూర్తిగా మార్చనున్నది. అంతేకాదు, ఈ ఫీచర్ అప్డేట్ గా గురించి వివరంచే స్క్రీన్ షాట్ ను కూడా పంచుకుంది ఈ నివేదిక. ఇందులో 2GB సైజు వరకూ ఫోటోలు మరియు వీడియోలను నేరుగా షేర్ చేయవచ్చని చూపిస్తోంది. అయితే, ఇప్పుడు మీరు మీరు మీ వాట్సాప్ నుండి ఒరిజినల్ వీడియోలు మరియు ఫోటోలను Document ఆప్షన్ ద్వారా పంపించవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ను అప్ కమింగ్ అప్డేట్ 2.23.18.12. అందుకుంటారు అని కూడా నివేదిక తెలిపింది. ఇప్పటికే HD Video మరియు HD Photo షేరింగ్ ఫీచర్ లను అందించిన వాట్సాప్ దీన్ని మరింతా ఆహ్లాదంగా మార్చడానికి చేస్తోంది. అప్ కమింగ్ ఫీచర్ వస్తే, మీరు మీ ఒరిజినల్ వీడియోలు మరియు ఒరిజినల్ ఇమేజ్ లను మీకు నచ్చిన వారితో నేరుగా షేర్ చేసుకోవచ్చు. అదిరింది కదా ఈ కొత్త Whatsapp News.