WhatsApp New Feature: వాట్సాప్ బ్లాగ్ పోస్ట్ నుంచి కొత్త ఫీచర్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ చాలా కాలంగా బెస్ట్ టెస్ట్ కోసం అందుబాటులో ఉంచిన వాట్సాప్, ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అందరికీ అందుబాటులో ఉంచింది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్లకు పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ కొత్త ఫీచర్ మల్టిపుల్ డివైజెస్ నుంచి కాంటాక్ట్ షింక్ కు వెసులు బాటు కల్పిస్తుంది.
వాట్సాప్ ఇప్పుడు కొత్తగా Add Contacts Across Devices ఫీచర్ ను అందించింది. ఈ ఫీచర్ తో వాట్సాప్ కలిగిన అన్ని డివైజెస్ నుంచి కాంటాక్ట్స్ ను యాడ్ చేసుకోవచ్చు. అంటే, మొబైల్, టాబ్లెట్ మరియు సిస్టం నుంచి కూడా కాంటాక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు.
అయితే, ఇది యూజర్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే, యూజర్ కోరుకుంటే యూజర్ మొబైల్ నుంచి మాత్రమే కాకుండా, యూజర్ యొక్క ల్యాప్ టాప్ లేదా సిస్టమ్ వంటి డివైజెస్ నుంచి కూడా కాంటాక్ట్ లను జత చేసుకోవచ్చు. అంతేకాదు, యూజర్లు వారి ఫోన్ కాంటాక్ట్ అడ్రస్ బుక్ లో లేదా ప్రత్యేకంగా వాట్సాప్ లో దాచుకోవాలో కూడా వారు నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read : Flipkart Sale నుంచి కేవలం రూ. 11,699 ధరకే 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!
ఈ కొత్త ఫీచర్ మీ వాట్సాప్ అకౌంట్ లోని సెట్టింగ్ లో లభిస్తుంది. దీనికోసం, ముందుగా మీరు మీ వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. తర్వాత Privacy లోకి వెళ్లి తర్వాత Contacts వెళ్లి తర్వాత WhatsApp Contacts ను ఎంచుకోవాలి. ఇక్కడ ఎంచుకునే ఆప్షన్ ను బట్టి యూజర్ తన కాంటాక్ట్స్ ని ఫోన్ లో సేవ్ చేయాలా లేక కేవలం వాట్సాప్ లో సేవ్ చేసుకోవాలో యూజర్ ఇష్టానుసారం చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ఇప్పుడు యూజర్స్ అందిరికి అందుబాటులోకి వచ్చింది మరియు మీరు కూడా మీ వాట్సాప్ ను అప్డేట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు.