భారత WhatsApp యూజర్లకు Meta AI ఫీచర్ వచ్చేసింది.. చెక్ చెశారా.!
అతిపెద్ద చాటింగ్ యాప్ WhatsApp లో కొత్త ఫీచర్ వచ్చి చేరింది
వాట్సాప్ Meta AI ఫీచర్ భారత్ లో చాలామంది యూజర్లకి అందుబాటులోకి వచ్చింది
ప్రాంప్ట్ ను అందిస్తే దానికి తగిన క్రియేటివ్ ఎఐ ఇమేజ్ ను అందిస్తుంది
జగమెరిగిన అతిపెద్ద చాటింగ్ యాప్ WhatsApp లో కొత్త ఫీచర్ వచ్చి చేరింది. ముందుగా ఇతర దేశాలలో ఈ ఫీచర్ ని తీసుకువచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఈ ఫీచర్ ని భారతీయ వాట్సాప్ యూజర్లకు కూడా అందించింది. అదే, వాట్సాప్ Meta AI ఫీచర్ మరియు ఈ ఫీచర్ భారత్లో చాలామంది యూజర్లకి అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ సంగతులు ఏంటో చూద్దామా.
WhatsApp Meta AI
వాట్సప్ మెటా ఎఐ ఫీచర్ ను ఇండియన్ యూజర్లకు కోసం కూడా వాట్సాప్ రిలీజ్ చేసింది. చాలామంది యూజర్లు ఎప్పటికే ఈ ఫీచర్ ను అందుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కొత్త ఫీచర్ తో మరింత ఫోన్ మీ వాట్సాప్ అందిస్తోంది. ఎందుకంటే, ఈ కొత్త ఫీచర్ తో మీకు ఇష్టమైన విధంగా AI ఇమేజ్ లను, ఇన్ఫర్మేషన్ మొదలుకొని కావాల్సిన అన్ని వివరాలను వాట్సాప్ లోనే పొందవచ్చు.
ఈ ఫీచర్ ను ఒకవేళ మీ ఫోన్ లో అందుకున్నట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, మంచి కిక్ ఇస్తుంది. అయితే, మీ ఫోన్ లో ఈ ఫీచర్ కనిపించకుంటే మాత్రం మీ ఫోన్ లోని వాట్సాప్ యాప్ ని అప్డేట్ చేసి ఒకసారి చేసుకోండి. ఈ ఫీచర్ మీ వాట్సాప్ ఓపెన్ చెయ్యగానే క్రింద ఎడమ వైపు మూలలో క్రింద పాప్ ఐకాన్ రూపంలో కనిపిస్తుంది.
అంతేకాదు, ఈ ఫీచర్ చాట్ లిస్ట్ లో టాప్ లో మెటా ఎఐ చాట్ బాట్ రూపంలో కనిపిస్తుంది. దీని పైన నొక్కగానే లోపల మీకు చాట్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన ప్రాంప్ట్ ను అందిస్తే దానికి తగిన క్రియేటివ్ ఎఐ ఇమేజ్ ను అందిస్తుంది.
Also Read: Vivo T3X 5G: 44W ఫాస్ట్ ఛార్జ్ 6000mAh బ్యాటరీతో లాంఛ్ అవుతోంది.!
ఇక్కడ కేవలం ఒక ఇమేజ్ క్రియేషన్ మాత్రమే కాదు ప్రస్తుతం AI యాప్స్ అందిస్తున్న అన్ని ఫీచర్స్ ను ఇది కలిగి వుంది. ఇక్కడ చాట్ బాక్స్ లో టచ్ చెయ్యగానే క్రింద నాలుగు బాక్స్ సెట్ మాదిరిగా కనిపించే ట్యాబ్ ఒకటి ఉంటుంది. దీన్ని పైన నొక్కగానే మీకు అనేక ఆప్షన్ లు కనిపిస్తాయి. మీ అవసరాన్ని బట్టి మీకు నచ్చిన ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు.
మరింకెదుకు ఆలశ్యం మీరు కూడా మీ వాట్సాప్ లో ఈ కొత్త ఎఐ ఫీచర్ ను చే చేసుకొని మరింత ఫన్ ను పొందండి.