ఇక Whatsapp నుండి కూడా 50 మంది ఒకేసారి వీడియో కాలింగ్ ఫీచర్

ఇక Whatsapp నుండి కూడా 50 మంది ఒకేసారి వీడియో కాలింగ్ ఫీచర్

Facebook గత నెలలో ఫేస్‌బుక్ మెసెంజర్ కోసం కొత్త మెసెంజర్ రూమ్స్ ను ప్రకటించింది. ఇదే పోర్టల్, Whatsapp మరియు Instagram మొదలైన వాటిలో ఇతర వినియోగదారులతో చాట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అలాగే, ఇటీవల ఈ సంస్థ  వాట్సాప్ ‌లోని వీడియో కాల్ పరిమితిని 8 మందికి పెంచిన విషయం కూడా మనకు తెలుసు. అయితే, మెసెంజర్ రూమ్ ద్వారా 50 మంది వరకు వీడియో కాల్ పరిమితిని ఇప్పుడు Whatsapp లో కూడా త్వరలోనే సపోర్ట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి, వాట్సాప్ ‌కు మెసెంజర్ రూమ్స్ సపోర్ట్ తీసుకురావడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్ యొక్క ఆండ్రాయిడ్ ఆధారిత యాప్ కోసం ఈ ఫీచర్‌ కోసం పనూలు మొదలు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం, కంపెనీ వాట్సాప్ వెబ్ ‌కు కూడా ఇలాంటి ఫంక్షన్‌ తీసుకురానుంది.

కాంటాక్ట్ షేరింగ్ ఎంపికలోని పేపర్ ‌క్లిప్ మెనూలో మెసెంజర్ రూమ్స్ ఫీచర్ కనిపిస్తుంది అని బ్లాగ్ సైట్ పేర్కొంది. మెసెంజర్ రూమ్స్ ఎంపికపైన క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారులు మెసెంజర్ రూమ్ గురించి సమాచారం ఇచ్చే కొత్త ఎంపికను పొందుతారు. మీ కాల్స్ వాట్సాప్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా రక్షించబడవని కూడా ప్రాంప్ట్ పేర్కొంది. ఇది కాకుండా, వాట్సాప్ వినియోగదారులు యాప్ యొక్క ప్రధాన మెనూ నుండి రూమ్ ని క్రియేట్ చెయ్యవచ్చు.

త్వరలో వాట్సాప్‌ లో మెసెంజర్ రూమ్ ‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ గత నెలలో ప్రకటించింది. ఇది కాకుండా, ఈ ఫీచర్ బీటా వెర్షన్‌ లో కంపెనీ ఆండ్రాయిడ్ యాప్‌ లో మాత్రమే కనిపించింది. త్వరలో వెబ్ ‌లోని మెసెంజర్ రూమ్స్ ని వాట్సాప్ తీసుకురాబోతున్నట్లు తెలిసింది.

మీకు మెసెంజర్ రూమ్స్ గురించి తెలియకపోతే, ఇది ఫేస్‌బుక్ మెసెంజర్ కోసం కొత్త గ్రూప్ వీడియో చాట్ ఫీచర్, దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్, పోర్టల్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇతర వినియోగదారులతో నేరుగా మాట్లాడగలరు. ఇటువంటి కొత్త అప్షన్ వాట్సాప్ ‌లో కూడా మెసెంజర్ రూమ్స్ రూపంలో త్వరలో వాట్సాప్ వెబ్‌లో అందుబాటులోకి రానున్నట్లు ఇప్పుడు WABetaInfo నుండి సమాచారం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo