WhatsApp New: మీరు స్టేటస్ పెడితె చాలు ఇక అందరికి తెలిసిపోతుంది.!
వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది
కొత్తగా తీసుకు వచ్చే ఫీచర్ ద్వారా స్టేటస్ పెడితే వెంటనే అందరికీ తెలియచేస్తుంది.
మీ వాట్సాప్ స్టేటస్ ను నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ అందిస్తుంది
WhatsApp New: వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది వాట్సాప్. రీసెంట్ గా కూడా ఈ జనం మెచ్చిన మెసేజింగ్ యాప్ మరొక కొత్త ఫీచర్ ను అందించింది. అయితే, కొత్తగా తీసుకు వచ్చిన ఈ ఫీచర్ ని మరింత మెరుగు చేసే మరొక కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది, అని అంచనా వేస్తున్నారు.
ఏమిటా WhatsApp New ఫీచర్?
ఇటీవల వాట్సప్ స్టేటస్ టైం ను 30 సెకన్ల నుండి 1 నిముషం నిడివికి పెంచిన వాట్సాప్ దీన్ని మెరుగుపరుస్తూ మరొక పిచర్ ని జత చేయబోతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా వాట్సాప్ స్టేటస్ పెడితే మీ కాంటాక్ట్స్ లేదా నచ్చిన వారు వాళ్లకి నచ్చినపుడు చూసేవారు. కానీ, ఇకనుండి వాట్సాప్ కొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ ద్వారా స్టేటస్ పెడితే వెంటనే అందరికీ తెలియచేస్తుంది.
దీనికోసం, వాట్సాప్ స్టేటస్ నోటిఫికేషన్ ఫీచర్ ను వాట్సాప్ పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ పెట్టిన వెంటనే ఎవరినైతే మీ స్టేటస్ చూడటానికి అనుమతిస్తారో, వారికి నోటిఫికేషన్ అందుతుంది. అంటే, మీ కంటాక్స్ లో ఉన్నవారికి మీ వాట్సాప్ స్టేటస్ ను నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ అందిస్తుంది.
Also Read: ఫ్యాషన్ మార్కెట్ కోసం Amazon Bazaar తెచ్చిన అమేజాన్.!
అయితే, ఈ ఫీచర్ ను గిరినుంచి కొత్త నివేదికలు వస్తున్నా, వాట్సాప్ మాత్రం ఈ ఫీచర్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెల్లడించ లేదు. కానీ, ఈ ఫీచర్ ఒకవేళ అంధుబాటులోకి వస్తే, యూజర్లకు వారి స్టేటస్ ను అందిరికి తెలియ చేసే అవకాశం లభిస్తుంది.
అయితే, కంటాక్స్ లో చాలా మంది యాడ్ అయ్యి ఉంటారు కాబట్టి, అందరి నోటిఫికేషన్ ను అందుకుంటే ఉంటే, యూజర్ అనుభూతి కొంత దెబ్బతినే అవకాశం ఉండవచ్చు. కానీ, రోజూ కొత్త స్టేటస్ లతో తమను తాము కొత్త చూపాలి అని చేసే వారికి మాత్రం ఇది పండగ లాంటి ఫీచర్ అవుతుంది.
చూడాలి, ఈ ఫీచర్ ను వాట్సాప్ తీసుకు వస్తుందో లేక ఇవన్నీ నిపుణులు వేస్తున్న అంచనా వార్తలు మాత్రమే అవుతాయా అని.