ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మంది వినియోగదారులతో, వాట్సాప్ ఈ రోజు ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ ఆప్స్ లో ఒకటిగా పేరొందింది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి యొక్క భయాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ కారణంగా, దీని యొక్క ఉపయోగం ఖచ్చితంగా మరింతగా పెరిగింది. ముఖ్యంగా, భారతీయులు, సన్నిహితంగా ఉండటానికి మరియు వారికీ సరైన సమాచారాన్ని పంపించడానికి, మీమ్స్ మరియు వీడియోలను షేర్ చేయడానికి ఈ అప్ ని ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. ఇది చాలా బ్యాండ్ విడ్త్ ను వినియోగించటానికి కూడా సహకరిస్తుంది. కానీ, చాలా మంది ప్రజలు ఇంటి వద్దే ఉండి, స్ట్రీమింగ్ సేవలకు మరియు ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి పరిమితమయ్యారు.
గతంలో, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ మరియు ఇతర స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లు ఎక్కువగా గా వాడుతున్న బ్యాండ్ విడ్త్ ను తగ్గించేందుకు వారి వీడియో నాణ్యతను తగ్గించడానికి అంగీకరించాయి. ఇప్పుడు, స్టేటస్ వీడియోలను 15 సెకన్లకు పరిమితం చేయడం ద్వారా వాట్సాప్ కూడా ఈ వరుసలో చేరుతోంది. ఇంతకుముందు మీ స్టేటస్ పై 30 సెకన్ల వీడియోను పోస్ట్ చేయడానికి మీకు అనుమతి ఉంది, కానీ ఇప్పుడు బ్యాండ్‌విడ్త్ వినియోగాన్ని తగ్గించడానికి వాట్సాప్ దానిని కేవలం 15 సెకన్లకు తగ్గించింది.
ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో WABetaInfo నుండి ఈ టీట్ అందుకున్నారు. ఈ ట్వీట్ ఇలా ఉంది, “మీరు 16 సెకన్ల కన్నా ఎక్కువ నిడివి వున్నా వీడియోలను వాట్సాప్ స్టేటస్ కి పంపలేరు: 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. ఇది భారతదేశంలో అమలవుతోంది మరియు ఇది సర్వర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లలో ట్రాఫిక్‌ను తగ్గించే ప్రయత్నం. ”
https://twitter.com/WABetaInfo/status/1243877509663424512?ref_src=twsrc%5Etfw