Whatsapp పే టీఎం కి పోటీగా తన చాటింగ్ యాప్ పై ఒక పేమెంట్ ఫీచర్ పరిచయం చేసింది. UPI- ఆధారిత Whatsapp పేమెంట్ ఫీచర్ Android మరియు iOS రెండిటి కోసం ప్రారంభించింది. ఇప్పుడు Whatsapp నుండి డబ్బు ట్రాన్సాక్షన్ చేయటం సులభంగా ఉంటుంది. కంపెనీ తన వినియోగదారులకు ఈ యాప్ ని సులభతరం చేయడానికి ఈ పేమెంట్ ఫీచర్ కి అనేక బ్యాంక్లను జోడిస్తుంది.
కంపెనీ ఈ ఫీచర్ ని నిరంతరం టెస్ట్ చేసి మరియు అప్డేట్ చేస్తుంది. ఇటీవలే విడుదలైన నివేదిక ప్రకారం, యుపిఏ ఆధారిత పేమెంట్ ఫీచర్ లో మొత్తం వాట్స్అప్ వినియోగదారులు 20 UPI పేమెంట్ మాత్రమే చేయగలరు.WhatsApp వినియోగదారులు రోజుకు 20 లావాదేవీలు మాత్రమే చేయగలరు. ఈ 20 లావాదేవీలు అదే VPA (వర్చువల్ పేమెంట్ అడ్రస్ ) లేదా వివిధ VPA లపై ఉంటాయి. అదనంగా, ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు ఒక రోజులో భారతీయ ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మొత్తం Rs.1,00,000 ను బదిలీ చేయగలదు.
Whats app పేమెంట్ ఫీచర్ ని ఇలా ఉపయోగించే విధానం:
- మొదట, Whatsapp ఓపెన్ చేసి మరియు సెట్టింగులు ఆప్షన్ ను వెళ్ళండి.
- యాడ్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఈ ఆప్షన్ పై క్లిక్ చేయడం వల్ల మీరు ముందు అనేక బ్యాంక్ల లిస్ట్ ను తెరుస్తారు. మీరు జోడించదలచిన అకౌంట్ ను ఎంచుకోండి.
- బ్యాంకుపై క్లిక్ చేసిన తర్వాత, మీ అకౌంట్ సమాచారం ఈ పేమెంట్ ఫీచర్ లో స్టోర్ చేయబడుతుంది మరియు మీ అకౌంట్ Whatsapp కు లింక్ చేయబడుతుంది.