WhatsApp లో కొత్త ఫీచర్స్

Updated on 10-Jul-2015
HIGHLIGHTS

లైక్ ఫీచర్ రాబోతుంది..

వాట్స్ అప్ లో సరికొత్తగా ఫేస్ బుక్ మాదిరిగా లైక్ ఫీచర్ మరియు "Mark as Unread" ఫీచర్ రానున్నాయని తాజా ఇంటర్నెట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

లైక్ ఫీచర్ వాట్స్ అప్ లోని ఇమేజెస్ కు పనిచేస్తుంది . అలాగే "Mark as Unread"  ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది అని వార్తలు. వాట్స్ అప్ బీటా tester, ILhan అనే వ్యక్తి లైక్ ఫీచర్ గురించి జర్మన్ లాంగ్వేజ్ లో ట్విట్టర్ లో ఇందుకు సంబంధించి ట్విట్ చేయటం జరిగింది.

టెస్టింగ్ దశలో ఉన్న "Mark as Unread" ఫీచర్ వాట్స్ అప్ డాకుమెంట్లలో బయట పడింది. ఇది ADSLZone కనుగొన్నది. వీటిలో "Mark as read" మరియు మార్క్ "Mark as Unread" కు సంబంధించిన రెండు ఫార్మ్స్ ఉన్నాయని తెలిపింది ADSLZone.

ఇవి కనుక వాస్తవ రూపంలోకి వస్తే, యూజర్స్ బాగా వాడుకునే మంచి ఫీచర్స్ అని చెప్పాలి. వాట్స్ అప్ లో ఇప్పటికే "Read Receipts" ఫీచర్ ఉంది. ఇది మీరు మెసేజ్ చదివినా మెసేజ్ చేసిన వ్యక్తులకు మీరు చదివినట్టు బ్లూ టిక్ మార్క్స్ చూపించకుండా చేస్తుంది.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :