తమ ప్లాట్ఫారమ్ పైన ఫేక్ సమాచారం మరియు నకిలీ వార్తలకు వ్యతికేరంగా పోరాడటానికి, WhatsApp PROTO కలిసి ఒక కొత్త టిప్ లైన్ని ప్రారంభించింది. ఈ టిప్ లైన్ నంబరు + 91-9643-000-888 ను WhatsApp వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్టులో జోడించవాల్సివుంటుంది. ఇక 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి, ఈ ప్లాట్ఫారమ్ ను టెక్స్ట్ మెసేజిలు, వీడియోలను మరియు ఫోటోలను తనిఖీ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు.
ఎన్నికల కాలం, దేశంలో అత్యంత కీలకమైన సమయం మరియు వాట్స్అప్ వంటి ప్రసిద్ధ సందేశ సేవా మార్గాలు, మరియు వివిధ మార్గాల ద్వారా దీన్ని ప్రచారం చేస్తుంది. అయితే, వినియోగదారులకు ఫేక్ న్యూస్ మరియు ఫార్వార్డ్ చేసిన ప్రచార సందేశాల వంటి వాటితో హాని కలిగించే లేదా పోటీదారులుకు హాని చేయగల ఉద్దేశ్యంతో ఇవి ఉండవచ్చు. కాబట్టి, WhatsApp వినియోగదారులు ఇటువంటివి చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి, ఈ క్రొత్త టిప్ లైన్ కోసం PROTO తో కలిసి పనిచేస్తోంది. PROTO అనేది, ఎన్నికల సమయంలో తప్పుగా వచ్చే, టెక్ట్స్, ఇమేజ్ మరియు వీడియోలను గురించి వినియోగదారులకు సూచనలు మరియు సలహాల కోసం డేటాబేస్ను రూపొందించడానికి మరియు తనిఖీ చేయడం కోసం ఉపయోగిపడుతుంది. అలాగే, WhatsApp చే ఇది సాంకేతికంగా సహాయపడుతుంది.
"WhatsApp వినియోగదారులు అనుమానాస్పద సందేశాన్ని tipline తో షేర్ చేసినపుడు, PROTO యొక్క ధృవీకరణ కేంద్రం షేర్ చేసుకునే సందేశానికి చేసిన సంబంధించి, అది ధృవీకరించబడిందా లేదా అనే విషయాన్నీ వినియోగదారుకు తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. సమాచారం నిజమైనది లేదా తప్పుదోవ పట్టించే, వివాదాస్పదమైన లేదా దానికి సంబధంధించిన వివరాలను సూచిస్తుంది మరియు అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర సమాచారాన్ని కలిగి ఉంటే అదికూడా అందిస్తుందని , "WhatsApp ఒక బ్లాగ్ పోస్ట్ లో రాస్తుంది.
WhatsApp ఎన్నికల టిప్ లైన్ సేవ ఇంగ్లీష్ కాకుండా హిందీ, తెలుగు, బెంగాలీ మరియు మలయాళం, వంటి నాలుగు ప్రాంతీయ భాషలు కవర్ చేస్తుంది. "ఎన్నికల కాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పుకార్లను నియంత్రించదానికి ప్రాంతీయ సంస్థలను ప్రోత్సహిస్తుంది" అని ఈ ఫేస్ బుక్ యాజమాన్య వేదిక పేర్కొంది.