WhatsApp యూజర్ల కోసం గొప్ప సెక్యూరిటీ ఫీచర్ అందిస్తోంది.!

WhatsApp యూజర్ల కోసం గొప్ప సెక్యూరిటీ ఫీచర్ అందిస్తోంది.!
HIGHLIGHTS

WhatsApp ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సూపర్ సెక్యూరిటీ ఫీచర్ తెస్తోంది

యూజర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది

ఈ ఫీచర్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి బీట్ టెస్టర్స్ కి అందుబాటులో వుంది

WhatsApp ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సూపర్ సెక్యూరిటీ ఫీచర్ తెస్తోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన యూజర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది. యూజర్ సెక్యూరిటీ కోసం ఇప్పటికే చాలా ఫీచర్స్ ను అందించిన వాట్సాప్, ఇప్పుడు తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్ లను అడ్డుకోవడానికి ఉపయోగపడే సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకు వస్తోంది. ఈ వాట్సాప్ అప్ కమింగ్ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.

WhatsApp Upcoming ఫీచర్

వాట్సాప్ అప్డేట్ లను అందించే వాబీటాఇన్ఫో ఈ కొత్త ఫీచర్ గురించి వెల్లడించింది. వాబీటాఇన్ఫో x అకౌంట్ నుంచి అధించిన కొత్త ట్వీట్ ప్రకారం, తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్ లను అడ్డుకోవడానికి వారి అకౌంట్ లను బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ తీసుకు వస్తోంది. ఈ ఫీచర్ ను ‘బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నోన్ అకౌంట్స్’ గా పిలుస్తోంది.

ఈ అప్ కమింగ్ బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నోన్ అకౌంట్స్ ఫీచర్ ను రానున్న కొత్త అప్డేట్ ద్వారా రోల్ అవుట్ చేస్తుందని కూడా ఈ ట్వీట్ లో వెల్లడించింది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.16 వెర్షన్ తో అందించింది. అయితే, రానున్న వారాల్లో ఈ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తుందని కూడా తెలిపింది.

WhatsApp Upcoming Feature

ఈ ఫీచర్ ను వాట్సాప్ సెట్టింగ్ లో ఉన్న అడ్వాన్స్ సెట్టింగ్ ట్యాబ్ లో అందిస్తుంది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేయడానికి ఈ ఫీచర్ పక్కన కనిపించే టోగుల్ ను ఆన్ చేసే సరిపోతుంది. ఈ ఫీచర్ ను ఇక్కడ అందించిన స్క్రీన్ షాట్ ఇమేజ్ లో చూడవచ్చు. ఇది IP Protection ఫీచర్ పైన కన్పిస్తుంది.

Also Read: Amazon GIF Sale: రూ. 37,999 కే iPhone 13 అందుకోండి అంటున్న అమెజాన్.!

ఈ ఫీచర్ ను ఎన్ బుల్ చేసుకున్న తర్వాత, తెలియని వారు (Unknown Account) నుంచి వచ్చే మెసేజ్ లను ఆటోమాటిగ్గా బ్లాక్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫీచర్ ఎన్ బుల్ చేసుకున్న యూజర్ కు స్పామ్ లోడ్ ను ఎంఈఐయూ బర్డెన్ కూడా తగ్గిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి బీట్ టెస్టర్స్ కి అందుబాటులో వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo