WHATSAPP యూజర్లకు శుభవార్త : ఇక మీ వాట్సాప్ నుండే డిజిటల్ పెమెంట్స్

Updated on 06-May-2020
HIGHLIGHTS

వాట్సాప్‌లోని పెమెంట్స్ పూర్తిగా డిజిటల్ పెమెంట్స్ ప్రోత్సహిస్తాయి

వాట్సాప్ యొక్క కొత్త సర్వీస్ , 'Whatsapp Pay' దాదాపు రెండు సంవత్సరాలుగా బీటా పరీక్షలో కనిపించింది మరియు Facebook  కొంతకాలంగా భారతదేశంలో దీనిని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ అధీకృత ప్లాట్‌ఫాం తన Payment  ఎంపికను భారతదేశంలో మూడు బ్యాంకులతో రాబోయే నెలల్లో ప్రారంభించబోతోంది.

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, మే చివరి నుండి భారతదేశంలోని వినియోగదారులందరికీ Whatsapp Pay అందుబాటులో ఉంటుంది. ప్రారంభంలో, ఈ ఎంపిక ICICI బ్యాంక్, Axis బ్యాంక్ మరియు HDFC బ్యాంక్ ‌లతో కలిసి పని చేస్తుంది. అయితే, దేశంలోని అత్యంత పెద్దదైన  ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరువాత చేర్చబడుతుంది. ఈ నాలుగు బ్యాంకులు ICICI బ్యాంక్‌తో ప్రారంభమైన బీటా టెస్టింగ్ మోడ్ ‌లో ఇంటిగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.

వాట్సాప్ ప్రతినిధి మనీకాంట్రోల్ ‌తో మాట్లాడుతూ, "వాట్సాప్ వినియోగదారులందరికీ Pay ఎంపికలను అందించడానికి మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాము." వాట్సాప్‌లోని పెమెంట్స్ పూర్తిగా డిజిటల్ పెమెంట్స్ ప్రోత్సహిస్తాయి మరియు కోవిడ్ -19 సమయంలో భారతదేశంలోని మా 400 మిలియన్ల వినియోగదారులకు లావాదేవీల కోసం కొత్త మార్గాన్ని తెరుస్తాయి. ”

వాట్సాప్ యొక్క UPI ఆధారిత సేవ Whatsapp Pay ఫిబ్రవరి 2018 నుండి టెస్ట్ మోడ్‌లో ఉంది. అయితే, ఇప్పుడు ఈ సేవ ప్రజలకు వరుసగా పంపిణీ చేయబడుతుంది. ఈ సర్వీస్ ను యాక్టివేట్ చేయడానికి, వినియోగదారులందరూ UPI ని రూపొందించడానికి చెల్లింపును ప్రారంభించాలి.

ఈ Facebook అధీకృత సోషల్ మెసేజింగ్ యాప్, భారతదేశంలో మొత్తం 400 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది మరియు ప్రపంచంలో ఈ యాప్ ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 2 బిలియన్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం, భారతదేశం యాప్స్ కి పెద్ద మార్కెట్. ఈ దృష్ట్యా, భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి వాట్సాప్ ఈ సర్వీస్  ప్రవేశపెడుతుంది. WhastApp Pay కాకుండా, గూగుల్ పే, Paytm మొదలైన డిజిటల్ చెల్లింపు సేవలు ఇప్పటికే భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :