WhatsApp introducing new voice chat features in meta ai
WhatsApp లో మరొక కొత్త ఫీచర్ ను యూజర్లు అందుకోనున్నారు. ఇప్పటికే చాలా గొప్ప మరియు ఉపయోగకరమైన ఫీచర్స్ ను అందించిన వాట్సాప్, ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ ఇటీవల తీసుకు వచ్చిన Meta AI ఫీచర్ ని మరింత సులభతరం మరియు ఉపయోగకరంగా మార్చడానికి వీలుగా ఈ కొత్త ఫీచర్ మీ తీసుకు వస్తుంది.
వాట్సాప్ రానున్న కొత్త అప్డేట్ తో కొత్త వాయిస్ చాట్ మోడ్ ఫీచర్ ను తీసుకు వస్తుందని వెబ్ బీటాఇన్ఫో తెలిపింది. వాట్సాప్ అప్డేట్ ను ముందుగా వెల్లడించే వెబ్ బీటాఇన్ఫో ఈ అప్ కమింగ్ వాట్సాప్ ఫీచర్ గురించి వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫీచర్ ను వాట్సాప్ బీటా అప్డేట్ వెర్షన్ 2.24.18.1 తో అందిస్తుందని వెబ్ బీటాఇన్ఫో తెలిపింది.
వెబ్ బీటాఇన్ఫో ప్రకారం, ఈ అప్ కమింగ్ అప్డేట్ తో Meta AI తో కమ్యూనికేట్ చేయడానికి వీలుగా వాయిస్ చాట్ మోడ్ (Chat Mode) ఫీచర్ ను పరిచయం చేయడానికి పని చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫీచర్ మెటా ఎఐ చాట్ మోడ్ ను తెలియ చేసే స్క్రీన్ షాట్ లను కూడా తన X (గతంలో ట్విట్టర్) అకౌంట్ నుంచి షేర్ చేసింది.
ఈ స్క్రీన్ షాట్ లను చూస్తుంటే ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో అర్థం అవుతుంది. వాట్సాప్ లోని మెటా ఎఐ ట్యాబ్ లో ఈ ఫీచర్ ను యాడ్ చేసింది. ఇందులో, మెటా ఎఐ లోకి వెళ్ళిన తర్వాత చాట్స్ కి పక్కనే వాయిస్ ఫీచర్ బటన్ ను అందించింది. ఈ బటన్ ను నొక్కగానే ఈ వాయిస్ చాట్ మోడ్ ఓపెన్ అవుతుంది.
Also Read: చవక ధరలో పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్.!
వాట్సాప్ మెటా లో ఇప్పటి వరకు కేవలం చాట్ సెక్షన్ నుండి చాటింగ్ ద్వారా మాత్రమే ఇమేజస్ మరియు ఇతర వివరాలు అందుకునే అవకాశం మాత్రమే వుంది. అయితే, ఈ అప్ కమింగ్ ఫీచర్ తో వాయిస్ సెర్చ్ తో పనులు చక్కబెట్టే అవకాశం ఉంటుంది.