WhatsApp యూజర్ల కోసం పండుగ లాంటి వార్త ఒకటి అందించింది. అతిపెద్ద చాట్ యాప్ అయిన వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ఫీచర్ పైన ఈ కొత్త వార్తను అందించింది. ఇప్పటికే అనేక ఉపయోగకరమైన ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్, వాటిలో జన రంజక ఫీచర్లను మరింతగా ప్రోత్సహిస్తోంది. అందుకే వాట్సప్ యాప్ లో యూజర్లకు అత్యంత ఇష్టమైన స్టేటస్ ఫీచర్ ను అప్డేట్ చేసింది.
తన యూజర్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన యూజర్ అనుభవాన్ని అందించడానికి వీలుగా వాట్సాప్ చాలా ఫీచర్స్ ను జత చేసింది. ఇది మాత్రమే కాదు యూజర్ల రక్షణ కోసం నిరంతరం కొత్త ఫీచర్లను కూడా జత చేస్తోంది. కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు యూజర్ల దైనందిన జీవితంలో అవసరమైన మరియు ఉపయోగకరమైన ఫీచర్లను కూడా అందించింది.
అటువంటి ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ కూడా ఒకటి. యూజర్లు వారికి సంబంధించిన కొత్త విషయాలు మరియు వివరాలతో స్టేటస్ లో అప్ టు డేట్ గా ఉండే వీలుంటుంది. అయితే, వాట్సప్ స్టేటస్ ను కేవలం 30 సెకండ్లు మాత్రమే సెట్ చేసే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఎక్కువ నిడివి ఉన్న స్టేటస్ వీడియో లేదా మరింకేదైనా విషయం షేర్ చేయాలంటే ముక్కలు ముక్కలుగా చేసి పోస్ట్ చేయవలసి ఉంటుంది. అయితే, వాట్సాప్ కొత్త అప్డేట్ ద్వారా ఈ వాట్సాప్ స్టేటస్ నిడివిని 1 నిమిషానికి పెంచేసింది.
Also Read: Gold Price: ఆల్ టైం గరిష్ట ధరను దాటిన బంగారం ధర.!
ఈ కొత్త అప్డేట్ తర్వాత వాట్సప్ యూజర్లు వారి వాట్సాప్ స్టేటస్ లను ఒక నిమిషం వరకు పోస్ట్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు తమ గురించి అందరికీ చెప్పాలనుకుని తమ వాట్సాప్ అకౌంట్ స్టేటస్ నుంచి లేటెస్ట్ వీడియోలను పోస్ట్ చేసే వారికి ఇది పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది.
కేవలం వారికి మాత్రమే కాదు, లాంగ్ వీడియోలను పోస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక వరం అవుతుంది. ఇది మాత్రమే కాదు మరిన్ని కొత్త అప్డేట్లను, కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో వాట్సప్ ఉన్నట్లు కొత్త నివేదికల ద్వారా తెలియ వస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త అప్డేట్ అందుకున్న వెంటనే మీరు కూడా మీ లాంగ్ వీడియోలను (1Min) సైతం మీ వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేసేయండి.