WhatsApp Green: ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద యూజర్ బేస్ ని కలిగి ఉన్న చాటింగ్ యాప్ గా వాట్సాప్ నిలుస్తుంది. కొత్త ఫీచర్స్ మరియు ప్రైవసీ తో పాటుగా అత్యున్నతమైన సెక్యూరిటీని వాట్సాప్ ఆఫర్ చేస్తుంది. అందుకే, వాట్సాప్ తన యూజర్లను ఎప్పుడు కొత్తదనంతో ఆకర్షిస్తుంది. అటువంటి వాట్సాప్ ఇప్పుడు రంగు మారింది. ముందు బ్లూ కలర్ లో కనిపించిన వాట్సాప్ ఇప్పుడు పూర్తిగా కొత్త కలర్ తో కనిపిస్తుంది.
నిన్న మొన్నటి వరకూ బ్లూ థీమ్ తో ఆకట్టుకున్న వాట్సాప్, ఇప్పుడు కొత్త కలర్ ను సంతరించుకుంది. వాట్సాప్ ఇప్పుడు కొత్త గ్రీన్ కలర్ ఇంటర్ ఫేజ్ కి మారిపోయింది. ఈ కొత్త కలర్ ఇంటర్ ఫేజ్ మీ ఫోన్ లో కనిపిస్తుంటే, ఇది కేవలం మీ ఫోన్ లో మాత్రమే వచ్చిన మార్పు గా అనుకోకండి. ఈ మార్పు ఇప్పుడు చాలా మంది ఫోన్ లలో ఉన్న వాట్సాప్ లో కనిపిస్తోంది.
ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పాలంటే, భారత్ తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలలో ఈ కొత్త కలర్ అప్డేట్ ను వాట్సాప్ అందించింది. మీ ఫోన్ లో ఈ కొత్త గ్రీన్ కలర్ కన్పించడం లేదా? అయితే, మీ ఫోన్ లో కూడా వాట్సాప్ కలర్ ఎప్పుడైనా మారే అవకాశం వుంది.
Also Read: Boult Bass Box: చవక ధరలో రెండు కొత్త సౌండ్ బార్స్ లాంఛ్ చేసిన బోల్ట్.!
వాస్తవానికి, iOS లో వాట్సాప్ యూజర్ల కోసం ముందుగా బ్లూ కలర్ లో ఉన్న వాట్సాప్, ఇప్పుడు పూర్తిగా గ్రీన్ కలర్ కి మారింది. అలాగే, Android యూజర్లకు కూడా వాట్సాప్ కొత్త గ్రీన్ కలర్ లోకి మారింది. ఐఫోన్ యూజర్లకు స్టేటస్ బార్ మొదలుకొని చాట్ లిస్ట్ వరకూ అన్ని కొద బ్లూ కలర్ నుండి గ్రీన్ కలర్ కు మారిపోయాయి.
ఇక ఆండ్రాయిడ్ యూజర్ల విషయానికి వస్తే, డార్క్ మోడ్ కలర్, ఇప్పుడు మరింత డార్క్ గా మారిపోయింది. అంతేకాదు, యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింతా మెరుగు పరిచేందుకు మరిన్ని చిన్న చిన్న మార్పులు కూడా వాట్సాప్ చేసినట్లు చూడవచ్చు.