వాట్స్ అప్ GIF (కదిలే) ఇమేజెస్ ను పంపేందుకు కొత్త అప్ డేట్ రోల్ చేసింది. అంటే డైరెక్ట్ గా emojis ను సెలెక్ట్ చేసి పంపినట్లే, వీటిని కూడా వాట్స్ అప్ లోనే సెలెక్ట్ చేసుకొని పంపగలరు. గతంలో కూడా ఈ ఫీచర్ ఇస్తుండేది కాని అది ఇంత సులువుగా ఉండేది కాదు. వీడియోస్ ను కన్వర్ట్ చేసి తద్వారా వచ్చే GIF లను షేర్ చేసేది. సో మీరు లేటెస్ట్ అప్ డేట్ ఇంస్టాల్ చేసుకొని ఉంటే వాట్స్ అప్ text బాక్స్ పక్కన ఉంటే emoji సింబల్ పై క్లిక్ చేస్తే అడుగున emoji(smiley) సింబల్ పక్కన GIF బటన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయండి. GIF ఇమేజ్ లను చూడగలరు. మీకు నచ్చిన వాటిపై టాప్ చేసి వాట్స్ అప్ లో పంపెయటమే. లేటెస్ట్ అప్ డేట్ ను ఇంస్టాల్ చేసుకున్నా కనపడకపోతే బీటా ను సైన్ అప్ అయ్యి బీటా అప్ డేట్ ను ఇంస్టాల్ చేసుకుంటే ఈ ఆప్షన్ చూడగలరు. ఇదే అప్ డేట్ లో మీడియా లిమిట్ 10 నుండి 30 వరకూ పెరిగింది. అంటే ఒకేసారి 30 ఫోటోస్ వరకూ పంపగలరు. బీటా సైన్ అప్ సమాచారం కొరకు ఈ లింక్ లో తెలుసుకోగలరు.