నేటి సమయంలో, WhatsApp ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసెంజర్ యాప్స్ లో ఒకటి, మరియు ఎల్లప్పుడూ టాప్ లోనే ఉంటుంది . ఇప్పుడు వినియోగదారులు పాత తొలగించిన మీడియా కంటెంట్ ని డౌన్లోడ్ చేసుకోగల క్రొత్త ఫీచర్ను ప్రవేశపెట్టారు.
ఇంతకుముందు వినియోగదారులు ఒక ఇమేజ్ , GIF లేదా షార్ట్ క్లిప్స్ తొలగించిన తర్వాత మళ్లీ డౌన్లోడ్ చేయలేకపోయేవారు , కానీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ అప్డేట్ తర్వాత ఇలా జరగదు .
Whatsapp దాని మీడియా స్టోరేజ్ ప్రోటోకాల్ లో మార్పులు చేసింది. ఇప్పుడు యూజర్లు 'కంటెంట్లను డౌన్లోడ్ చేసిన తర్వాత, మెసేజ్ మల్టీమీడియా కంటెంట్ Whatsapp యొక్క సర్వర్లో స్టోర్ చేయబడుతుంది. దీనితో పాటుగా వినియోగదారుని మినహాయించి దాన్ని ఎవరూ యాక్సెస్ చేయలేరు. ప్రస్తుతం ఈ WhatsApp ఫీచర్ Android వెర్షన్ (2.18.113) కోసం అందుబాటులో ఉంది మరియు త్వరలో iOS కోసం ఈ అప్డేట్ చూస్తారు.
ఇప్పుడు వినియోగదారు తమ ఫోన్ యొక్క స్టోరేజ్ నుండి ఏ మీడియా కంటెంట్ అయినా తొలగించినట్లయితే, అది WhatsApp ద్వారా డౌన్లోడ్ చేయబడితే, వినియోగదారు తిరిగి మారవచ్చు మరియు కంటెంట్ ని ట్యాప్ చేయటం ద్వారా దాన్ని డౌన్లోడ్ చేయవచ్చు.
అయితే, మేము ఈ ఫీచర్ ని కొన్ని Android ఫోన్స్ లో పరీక్షించాము మరియు ఈ ఫీచర్ ప్రస్తుతం పని చేయలేదు. ఈ అప్డేట్ ప్రస్తుతం భారతీయ వినియోగదారుల కోసం రాలేదు.