Whatsapp ప్రపంచంలో అత్యంత ఉపయోగకరమైన యాప్స్ లో ఒకటి. దాదాపు అన్ని వయస్సుల ప్రజలు దీనిని ఉపయోగిస్తారు. ఇప్పటివరకు వినియోగదారులు WhatsApp లో టెక్స్ట్ ,ఫొటోస్ , వీడియో అండ్ మెసేజ్ లతో పాటు వాయిసెస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ కూడా చేయవచ్చు , కానీ త్వరలో వినియోగదారులు WhatsApp గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ని ఉపయోగించగలరు.
కంపెనీ వీడియో కాలింగ్ ఫీచర్ను టెస్టింగ్ చేస్తున్నట్లు ఒక రిపోర్ట్ లో లో WABetaInfo నివేదించింది. ఈ ఫీచర్ మొదట Android ప్లాట్ఫారమ్లో లభ్యమవుతుంది మరియు తర్వాత ఇది iOS ప్లాట్ఫారమ్ కోసం విడుదల చేయబడుతుంది.
రిపోర్ట్ ప్రకారం, మొత్తం నలుగురు కలిసి గ్రూప్ వీడియో కాలింగ్ చేయగలరు. ఈ ఫీచర్లు బీటా వెర్షన్ 2.17.437 మరియు 2.17.443 వాట్స్యాప్ యొక్క అప్డేట్ లలో కనిపిస్తాయి.
గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్తో పాటు, వాట్స్అప్ త్వరలో వినియోగదారులకు స్టిక్కర్లను ప్రవేశపెడుతుంది. Facebook Messenger యాప్ లో వున్నట్లుగా అన్నమాట