వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ వచ్చేసింది.. ఇలా క్రియేట్ చేసుకోండి.!
వాట్సాప్ యూజర్లు ఎదురు చూస్తున్న వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ వచ్చేసింది
iOS మరియు Android యూజర్లకు అందుబాటులోకి వచ్చింది
20 గ్రూప్స్ వరకూ కలగలిపి ఒక కమ్యూనిటీగా మార్చుకోవచ్చు
చాలా కాలంగా వాట్సాప్ యూజర్లు ఎదురు చూస్తున్న వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫీచర్ ఇండియాలోని iOS మరియు Android యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర ద్వారా దాదాపుగా 20 గ్రూప్స్ వరకూ కలగలిపి ఒక కమ్యూనిటీగా మార్చుకోవచ్చు. అంటే, మరింత ఎక్కువ మందిని మీ గ్రూప్స్ ద్వారా ఒక కమ్యూనిటీలోకి తీసుకురావడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ కొత్తగా జత చేసిన ఈ వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ గురించి చూద్దాం.
వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్
ముందుగా, ఈ వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ యాప్ లో ఎక్కడ ఉంటుందనే చూస్తే, మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తరువాత పైన ఎడమ భాగంలో 'Chats' అప్షన్ కి ప్రక్కన ఈ వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ఐకాన్ పనిపిస్తుంది. ఈ వాట్సాప్ కమ్యూనిటీ ఐకాన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు లోపలకు మళ్ళించబడతారు.
వాట్సాప్ కమ్యూనిటీ ఎలా క్రియేట్ చేయ్యాలి?
ముందుగా వాట్సాప్ కమ్యూనిటీ ఐకాన్ పైన క్లిక్ చేసి లోపలకి ప్రవేశించాలి. అందులో, క్రింద 'Start Your Community' అప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ అప్షన్ పైన నొక్కండి. ఇప్పుడు మీరు Start Your Community పేజ్ కి వెళతారు మరియు ఇక్కడ క్రింద అందించిన అప్షన్స్ నొక్కండి. ఇందులో, మీరు క్రియేట్ చేయాలనుకునే కమ్యూనిటీ పేరును మరియు గ్రూప్ వర్ణన (description) ఎంటర్ చేసి మీ కమ్యూనిటీ క్రియేట్ చేయవచ్చు.
తరువాత, మీ వాట్సాప్ లో ఇప్పటికే వున్నా గ్రూప్ ను యాడ్ చెయ్యాలా (Add Existing Group) మరియు కొత్త గ్రూప్ క్రియేట్ (Create New Group) అనే రెండు అప్షన్స్ వస్తాయి. ఈ రెండు అప్షన్ల ను ఎంచుకోవడం ద్వారా మీరు క్రియేట్ చేయదలుచుకున్నా 'వాట్సాప్ కమ్యూనిటీ' ని క్రియేట్ చేయ్యవచ్చు.