వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఒక కొత్త ఓరవొడిని తీసుకు వస్తూనే వుంది. ఇప్పటికే ఉపయోగకరమైన చాలా ఫీచర్లను తీసుకు వచ్చిన వాట్సాప్ ఇప్పుడు కొత్త whatsapp channels ఫీచర్ ను ప్రకటించి మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే Instagram మరియు Telegram వంటి యాప్స్ లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఎట్టకేలకు వాట్సాప్ లో కూడా అడుగుపెట్టింది. ఈ New whatsapp channels ఫీచర్ ద్వారా దేశంలోని అతిరధ మహారధుల ఛానెల్స్ ను నేరుగా ఫాలో లేదా సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ ఛానెల్స్ అనేది ఎక్కడ యాప్ లో ఎక్కడ ఉంటుంది అని చూస్తున్నారా? చాలా సింపుల్, వాట్సాప్ లో Updates అనే కొత్త ట్యాబ్ కనిపిస్తుంది, అదే whatsapp channels. ఇక్కడ మీకు వచ్చిన వారిని సెర్చ్ చేసి ఫాలో చేసే వీలుంది.
మీరు కూడా వాట్సాప్ ఛానెల్ లో ఒక ఛానెల్ క్రియేట్ చెయ్యాలనుకుంటున్నారా? ఇక్కడ అందించిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. మీ ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్క్ చెయ్యండి
2. వాట్సాప్ లోని 'Updates' ట్యాబ్ లోకి వెళ్ళండి
3. ఇక్కడ Customize చానెల్ లోకి వెళ్ళి ఛానెల్ క్రియేట్ చేయండి
మెటా ప్రకారం, నచ్చిన సెలెబ్రెటిస్ అప్డేట్స్ ను నేరుగా పొందడాని ఒక సురక్షితమైన ప్రైవేట్ దారిగా ఈ ఫీచర్ గురించి చెబుతోంది. ఈ కొత్త whatsapp channels ను ఇండియన్ క్రికెట్ టీమ్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ మరియు విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు.
వాట్సాప్ ఛానెల్స్ లో ఎవరైనా వారి ఛానెల్ ను క్రియేట్ చేయవచ్చా అని ఎక్కువ మంది యూజర్లకు వచ్చే మొదటి డౌట్ అవునా?
అయితే, వాట్సాప్ దీనికి కూడా సమాధానం ముందుగానే అందించింది. అదేమిటంటే, ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మరియు కొంత మంది లిమిటెడ్ అకౌంట్స్ కి మాత్రామే ఈ అవకాశం అందించింది.
ఎప్పుడైతే మీ అకౌంట్ కోసం కూడా వాట్సాప్ చానెల్ ను క్రియేట్ చెయ్యడానికి అవకాశం వస్తుందో, అప్పుడు వాట్సాప్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియపరుస్తుంది.