WhatsApp Camera కోసం కొత్త ఫీచర్ ను తెస్తున్న వాట్సాప్.!
WhatsApp Camera కోసం ఇప్పుడు కొత్త ఫీచర్ ను తెచ్చే పనిలో పడింది వాట్సాప్. రీసెంట్ గా స్టేటస్ అప్డేట్ రీ షేర్ మరియు తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే మెసేజ్ లను అడ్డుకోవడానికి Unknown అకౌంట్ బ్లాక్ ఫీచర్ కోసం శ్రమించింది. అయితే, ఇప్పుడు వాట్సప్ కెమేరా పై ద్రుష్టి సారించింది. యూజర్లు ఎక్కువగా ఇష్టపడే కెమెరా ఎఫెక్ట్ ఫీచర్ ను తీసుకు రావడానికి వాట్సాప్ పని చేస్తోంది.
WhatsApp Camera Effect Feature
వాట్సాప్ లో కొత్త Camera Effects ఫీచర్ ను జత చేయడం కోసం వాట్సాప్ పని చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. వాబీటాఇన్ఫో X అకౌంట్ (గతంలో ట్విట్టర్) నుంచి కొత్త అప్డేట్ ను షేర్ చేసింది. ట్వీట్ ప్రకారం, ఆండ్రాయిడ్ కొత్త అప్డేట్ తో ఈ కొత్త కెమెరా ఎఫెక్ట్ ఫీచర్ ను రోల్ అవుట్ చేస్తుంది.
ఈ కొత్త ఫీచర్ తో వీడియో కాలింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత గొప్పగా మారుతుంది. ఎందుకంటే, ఈ ఫీచర్ తో వీడియో లో కొత్త విజువల్స్ ను యాడ్ చేసుకునే వీలుంటుంది. అంటే, వీడియో కాలింగ్ బ్యాగ్రౌండ్ తో పాటు మరిన్ని విజువల్ ఎఫెక్ట్స్ ను జత చేసుకోవచ్చు. వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.24.20.20 అప్డేట్ తో ఈ అప్ కమింగ్ ఫీచర్ ను కనుగొన్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది.
ఈ అప్ కమింగ్ ఫీచర్ ను వివరించే స్క్రీన్ షాట్ లను కూడా వాబీటాఇన్ఫో షేర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ లో ఫోటో, వీడియో మరియు వీడియో కాలింగ్ కోసం కొత్తగా ఫిల్టర్స్ మరియు బ్యాగ్రౌండ్ ఆప్షన్ కనిపిస్తూన్నాయి. ఈ స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడవచ్చు.
Also Read: ANC పై కూడా 70 గంటల ప్లే బ్యాక్ అందించే కొత్త Headphone లాంచ్ చేసిన Marshal.!
కెమెరా సెక్షన్ లో కొత్తగా అందించిన ఫిల్టర్ మరియు బ్యాగ్రౌండ్ బటన్స్ తో ఫోటోలు మరియు వీడియోలను మరింత సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తో స్కిన్ టోన్, స్కిన్ స్మూథింగ్ మరియు తీసిన ఫోటోలు రియల్ టైం లో సరి చేసుకునే అవకాశం కూడా అందిస్తుంది. ఈ కెమేరా ఎఫెక్ట్ ఫీచర్ కొత్త అప్డేట్ తో లభిస్తుంది.