వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో ఒకటి .వాట్సాప్ కూడా ఫేస్ బుక్ యాజమాన్యంలోని యాప్. అయితే, ఎప్పటికప్పుడు ట్రెండీ మరియు కొత్త అప్డేట్స్ తో వినియోగదారులకు మంచి ఫీచర్లను తీసుకొచ్చే యాప్ గా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అంటే, సమయానుగుణంగా మీరు వాట్సాప్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు.
ఇప్పుడు కూడా వాట్సాప్ కొత్త అప్ డేట్స్ తో తిరిగి వచ్చింది. ఇప్పుడు, ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది .మొదటిసారిగా Advance Search అని పిలవబడే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ అప్షన్ యొక్క ఉపయోగం గురించి మాట్లాడితే, మీ చాట్స్, వీడియోలు మరియు పిక్చర్స్ ను సులభంగా సెర్చ్ చెయ్యడానికి ఇది మీకు సహాయపడుతుంది.
ఉదాహరణకు, మీ వాట్సాప్ లో మీ స్నేహితుడు గత నెలలో మీకు పంపిన మెసేజ్ కోసం మీరు వెతకాలి. అటువంటి సమయంలో, ఈ అడ్వాన్స్ సెర్చ్ ద్వారా మీరు చాలా సులభంగా పొందవచ్చు .తరువాత ఆండ్రాయిడ్ యానిమేటెడ్ స్టిక్కర్లు మరియు మరియు మరిన్ని ఫీచర్లను ఈ అప్డేట్ తీసుకొస్తోంది, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దీన్ని చాలా త్వరగా పొందగలరు.