థర్డ్ పార్టీ అప్లికేషన్, వాట్సప్ ప్లస్ ను వాడుతూ, అధికారిక వాట్సప్ నిబంధనలను ఉల్లంఘించిన కొంతమంది వాట్సప్ ప్లస్ వినియోగదారులను వాట్సప్ 24 గంటల నిషేధించారు. వివిధ వినియోగదారులు ఫేస్ బుక్, గూగల్ ప్లస్ మరియు ట్విట్టర్ వంటి సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో నిషేధాన్ని వెల్లడించారు.
వాట్సప్ ప్లస్ ను అన్ ఇంస్టాల్ చేసి అసలైన వాట్సప్ వెర్షన్ ను అధికారిక వెబ్సైటు లేదా గూగల్ ప్లే నుండి ఇంస్టాల్ చేసుకొని తిరిగి పూర్తి సర్వీసులను ఆనందించమని వినియోగదారులకి విజ్ఞప్తి చేసింది వాట్సప్. వాట్సప్ ప్లస్ ఆప్ సందేశాల సేవలకు సంబంధించిన ఆప్ కాదని వెల్లడిస్తూ, ప్లస్ వెర్షన్ వినియోగదారుల సమాచార బద్రత పై సైతం కంపని ఎటువంటి బాధ్యత వహించదు అని తెలియజేసింది.
నివేదిక ప్రకారం వాట్సప్ ప్లస్ ను మాల్వేర్ గా ప్రకటించి, వినియోగదారుల స్వయంగా తమ బద్రత కొరకు దానిని డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరించింది అధికారిక వాట్సప్.
వాట్సప్ అఫీషియల్ ఆప్ ఎఫ్ఏక్యు సెక్షన్ లో సైతం ప్లస్ ఆప్ డెవలపర్లుకు అధికారిక ఆప్ కంపనితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ప్లస్ ఆప్ కు వాడిన సోర్సుకోడు పై వాట్సప్ ఎటువంటి సురక్షితమైన హామీ ఇవ్వలేదని తేల్చేసింది. వినియోగదారులకు తెలియకుండా వ్యక్తిగతమైన సమాచారం థర్డ్ పార్టీ సర్వీసులకు వెళ్ళటం గురించి కూడా ప్రస్తావించింది.
నివేదికల ప్రకారం వాట్సప్ కూడా తన సొంత వెబ్ క్లయింట్ కొరకు పని చేస్తుంది. తాజాగా విడుదలైన వాట్సప్ కొత్త అప్డేట్ లో దాగి ఉన్న కోడ్ ప్రకారం వెబ్ వాట్సప్ లోకి లాగిన్ అవ్వటం మరియు వాట్సప్ ఆన్లైన్ స్టాటస్ ట్రాకింగ్ లను రాబోయే వెర్షన్ జోడించనుంది అని తెలుస్తుంది
మూలం: వాట్సప్