WhatsApp: ఇండియాలో 75 లక్షల అకౌంట్స్ తొలగించిన వాట్సాప్.!

WhatsApp: ఇండియాలో 75 లక్షల అకౌంట్స్ తొలగించిన వాట్సాప్.!
HIGHLIGHTS

WhatsApp కొత్తగా ఇండియాలో 75 లక్షల అకౌంట్స్ ను తొలగించింది

యూజర్ల సెక్యూరిటీ మరియు ప్రైవసీకి పెద్ద పీఠ వేసే వాట్సాప్

గత నెల అత్యధికంగా 75 లక్షల కంటే ఎక్కువ అకౌంట్స్ ను తొలగించినట్లు వాట్సాప్ తెలిపింది

ప్రపంచలోని అత్యధికంగా యూజర్లను కలిగివున్న మెసేజింగ్ యాప్ WhatsApp కొత్తగా ఇండియాలో 75 లక్షల అకౌంట్స్ ను తొలగించింది. యూజర్ల సెక్యూరిటీ మరియు ప్రైవసీకి పెద్ద పీఠ వేసే వాట్సాప్, కంపెనీ నియమాలను ఉల్లఘించిన యూజర్ల ఖాతాలను తొలగిస్తోంది. ఇది ప్రతి నెలా జరిగే ప్రక్రియే అయినా గత నెల అత్యధికంగా 75 లక్షల కంటే ఎక్కువ అకౌంట్స్ ను తొలగించినట్లు వాట్సాప్ తెలిపింది.

Whatsapp

వాట్సాప్ యూజర్ల భద్రత కోసం వాట్సాప్ తీసుకునే చర్యలలో భాగంగా రెగ్యులర్ గా అకౌంట్స్ ను ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్ల ద్వారా వాట్సాప్ నియమాలను ఉల్లంఘించే అకౌంట్స్ ను యాప్ నుండి నిషేధిస్తుంది. ఇది IT Rules 2021 ను అనుసరించి వాట్సాప్ యూజర్ల అకౌంట్స్ ను ఫిల్టర్ చేస్తుంది. ఐటి రూల్స్ 2021 ప్రకారం, ఇతరలను భయభ్రాంతులకు గురించేసే లేదా పోర్నోగ్రఫీ లేదా సాఫ్ట్ వేర్ వైరస్ లేదా కాపీరైట్ వంటి విషయాలను షేర్ చేసే అకౌంట్స్ ను నిషేధిస్తుంది.

ఇక ఇప్పుడు కొత్తగా తొలగించిన 75 లక్షల అకౌంట్స్ విషయానికి వస్తే, అక్టోబర్ నెల మొత్తం మీద అందుకున్న రిపోర్ట్స్ ద్వారా ఈ అకౌంట్స్ ను నిషేధించింది. అంటే, అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకూ వాట్సాప్ నియమాలను ఉల్లంఘించిన అకౌంట్స్ ను నిషేధించింది వాట్సాప్.

Also Read : Infinix Smart 8 HD: వెరైటీ కలర్ మరియు డిజైన్ తో వస్తున్న కొత్త ఫోన్.!

వాస్తవానికి, అక్టోబర్ నెల మొత్తం మీద 9063 కంప్లైట్స్ అందుకున్నట్లు వాటికీ అనుగుణంగా కూడా కొన్ని అకౌంట్స్ నిషేదించినట్లు కూడా తెలిపింది. అయితే, అధిక శాతం అకౌంట్స్ ను వాట్సాప్ నియమాల ఉల్లంఘన కారణంగానే డిలీట్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది.

Whatsapp new secret code features
వాట్సాప్ చాట్ సీక్రెట్ కోడ్

వాట్సాప్ ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే వుంది. ఈ కొత్త ఫీచర్లలో యూజర్లకు అవసరమైన మరియు ప్రైవసీని మరింత పటిష్టంగా చేసే ఫీచర్లే ఎక్కుగా ఉంటాయి. రీసెంట్ గా కూడా చాట్ సీక్రెట్ కోడ్ ఫీచర్ ను తీసుకు వచ్చింది వాట్సాప్. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వారి చాటింగ్ హిస్టరీని పదిలంగా దాచుకోవచ్చు.

ఈ ఫీచర్ కోసం మీరు మీకు నచ్చిన యూనిక్ పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవచ్చు. అలాగే, ఇందులో జత చేసిన అకౌంట్ ను Lock Chats లో భద్రం కూడా చేసుకోవచ్చు. ఈ చాట్స్ ను మీరు తప్ప ఇంకెవరూ చూసే అవకాశం ఉండదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo