భారతీయ వినియోగదారులకు Whatsapp మరొకసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో 22 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్స్ ను బ్యాన్ చేసిన వాట్సాప్, అక్టోబర్ నెల మొత్తం మీద 22 లక్షలకు పైగా భారతీయుల వాట్సాప్ అకౌంట్ లను బ్యాన్ చేసింది. అత్యంత ప్రజాధారణ పొందిన ఈ మెసేజింగ్ అప్లికేషన్ గత కొన్ని నెలలుగా పెద్ద మొత్తంలో యూజర్ అకౌంట్స్ ను బ్యాన్ చేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త IT చట్టాల తరువాత నుండి భారతీయుల వాట్సాప్ అకౌంట్స్ భారీ స్థాయిలో బ్యాన్ అవుతున్నాయి.
వాట్సాప్ యాప్ భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు ఈ వినియోగదారులు ఈ చాటింగ్ యాప్ నుండి నిషేధించబడ్డారు. అంతేకాదు, వాట్సాప్ తన పేమెంట్ సర్వీస్ ను కూడా అఫర్ చేస్తున్న కారణంగా యూజర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ మరింత పటిష్టంగా తీర్చిదిద్దడానికి, సవివరంగా లేని లేదా అనుమానిత వినియోగదారులను తొలగించాల్సి వస్తుంది.
అయితే, ఇది ఇంతటితో ఆగదు మరియు మరిన్ని భారతీయ వాట్సాప్ అకౌంట్స్ కూడా బ్యాన్ కావచ్చు. వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో దిట్ట మరియు మేము మా ప్లాట్‌ఫారమ్‌లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అత్యాధునిక టెక్నాలజీ, డేటా శాస్త్రవేత్తలు మరియు నిపుణులు వంటి చర్యలను నిరంతరంగా కొనసాగిస్తుందనిగత నెల వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అన్న మాట ప్రకారం, యూజర్లకు మరింత సౌకర్యాన్ని మరియు సెక్యూరిటీని అందించడానికి వీలుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సాప్ కు జతచేయడమే కాకుండా అనుచిత అకౌంట్స్ ను బ్యాన్ కూడా చేస్తోంది. ఇక బ్యాన్ అకౌంట్స్ విషయానికి వస్తే, జూన్ నుండి సెప్టెంబర్ వరకూ సుమారు 90 లక్షలకు పైగా భారతీయ వినియోగదారుల అకౌంట్స్ బ్యాన్ చేసింది. ఇప్పుడు కొత్తగా బ్యాన్ చేసిన 22 లక్షల అకౌంట్స్ ను కూడా దీనికి జతచేస్తే 1కోటి 10 లక్షల పైచిలుకు భారతీయ వాట్సాప్ అకౌంట్స్ ను వాట్సాప్ బ్యాన్ చేసింది.