WhatsApp వాడుతున్న వారికి Surprising News అనౌన్స్ చేసింది. ఇక నుండి ఈ ఫోన్ లలో వాట్సాప్ పని చెయ్యదని అనౌన్స్ చేసి సర్ఫ్రైజ్ చేసింది వాట్సప్. అంతేకాదు, వాట్సాప్ పని చెయ్యని స్మార్ట్ ఫోన్ ల లిస్ట్ కూడా వెల్లడించింది. ఒకవేళ వాట్సాప్ ప్రకటించిన లిస్ట్ లోని స్మార్ట్ ఫోన్ ను మీరు వాడుతున్నట్లయితే త్వరలో మీ ఫోన్ లో వాట్సాప్ పని చేయడం మానేస్తుందని గుర్తుచుకోండి. వాట్సాప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది మరియు ఆ ఫోన్స్ లిస్ట్ ఏమిటో తెలుసుకోండి.
వాట్సాప్ ఎందుకు త్వరలో ఈ ఫోన్ లలో ఆగుతుంది? అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి, వాట్సాప్ ప్రతి సంవత్సరం సెక్యూరిటీ మరియు ప్రైవసీ అప్డేట్స్ కారణంగా iOS మరియు Android ల యొక్క పాత OS వెర్షన్స్ పైన పనిచేసే ఫోన్ లలో సపోర్ట్ ను నిలిపి వేస్తుంది. ఇప్పుడు కూడా వాట్సాప్ ఇదే రీజన్ తో iOS మరియు Android పాత వెర్షన్ ల పైన పనిచేసే ఫోన్ లలో వాట్సాప్ సపోర్ట్ ను నిలిపి వేసింది.
Also Read : 8 వేల రూపాయల బడ్జెట్ లో Smart Tv కోసం చూస్తున్నారా|Tech News
ఇక ఏ ఫోన్లలో వాట్సాప్ పని చెయ్యదు మరియు ఆ ఫోన్స్ వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువగా ఉపయోగిస్తున్న OS డివైజ్ ల కోసం తన సపోర్ట్ ను నిలిపి వేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. Android వెర్షన్ 4.1 మరియు అంత కంటే తక్కువ వెర్షన్ ఫోన్ లలో వాట్సాప్ సేవలు నిలిచి పోతాయని వాట్సాప్ తెలిపింది. వెర్షన్ ఈ ఫోన్ లు చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు మరియు వారు వాట్సాప్ కోసం కొత్త ఫోన్ లకు మారాల్సి ఉంటుంది.
వాట్సాప్ సపోర్ట్ ఆగిపనున్న స్మార్ట్ ఫోన్ ల లిస్ట్ వివరాల్లోకి వెళితే, మోటోరోలా జూమ్, HTC సెన్సేషన్, Sony ఎక్స్ పీరియా Z, LG ఆప్టిమస్ జి ప్రో, Nexus 7, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 2, HTC One, మోటోరోలా డ్రాయర్ రేజర్, Sony ఎక్స్ పీరియా S2, శామ్సంగ్ గెలాక్సీ S, HTC డిజైర్ HD, సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్3, శామ్సంగ్ గెలాక్సీ నెక్సస్ మరియు అసూస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ ఫార్మర్ తో పాటు ఏసర్ ఐసోటోనియా ట్యాబ్ A5003 వంటి ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఆండ్రాయిడ్ మూగబోతుంది.
Also Read : Amazon మరియు Flipkart పండుగ సేల్స్ వచ్చేసాయి.!