Whatsapp లో గ్రూప్స్ కోసం కొత్త Privacy Settings తీసుకొచ్చింది : ఇక మీ గ్రూప్ మీ ఇష్టం
ఇప్పుడు గ్రూప్స్ మీద వినియోగదారుల వినతుల ఆధారంగా, కొత్త ప్రైవేసి సెట్టింగ్స్ ప్రకటించింది.
చాటింగ్ మరియు కాలింగ్ వంటి ఫీచర్లతో, అత్యంత ప్రాచుర్యం పొందిన Whatsapp తన వినియోగదారులకు, వారి ప్రైవసీని మరింతగా పెంపొందించలా దోహదపడే అనేకమైన ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇటీవలే, తన వినియోదారుల కోసం ' ఫింగర్ ప్రింట్ లాక్ ' ని తీసుకొచ్చింది. దీనితో మరింత సెక్యూరిటీని వారి వాట్స్ యాప్ కి జోడించింది. అయితే, ఇప్పుడు గ్రూప్స్ మీద వినియోగదారుల వినతుల ఆధారంగా, కొత్త ప్రైవేసి సెట్టింగ్స్ కూడా ప్రకటించింది.
గ్రూప్స్ కోసం కొత్త ప్రైవసీ సెట్టింగ్స్
మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సహోద్యోగులు, క్లాస్ మేట్స్ మరియు ఇటువంటి మరిన్ని ముఖ్యమైన వారి గ్రూప్స్ లో మనల్ని Add చేస్తుంటారు. అయితే, అనవసరమైన మరియు మనకు తెలియని వారు కూడా మనల్ని అనేకమైన సందర్భల్లో Add చేస్తుంటారు. ఈ విషయం, కొంత మందికి చాల ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. ఇటువంటి వాటిమీద మరింత దృష్టిపెట్టిన వాట్స్ యాప్ బృందం, ఈరోజు గ్రూప్స్ కోసం ఒక కొత్త Privacy Settings తీసుకొచ్చింది.
మీ ఫోనులో Enable చేయడం ఎలా?
ఇది చాల సులభమైన పద్దతి, దీన్ని చాల శుభంగా మీ ఫోనులో చేయవచ్చు. దీనికోసం, ముందుగా మీ whatsapp ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తరువాత, యాప్ లోని Settings లోకి వెళ్ళాలి. ఇక్కడ, అక్కౌంట్ లోకి వెళ్లి అక్కడ ప్రైవసీ పైన నొక్కాలి, ఇక్కడ Groups ని ఎంచుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ప్రస్తుతం ఇది EveryOne అని చూపిస్తుంది. నాటే ఎవరైనా సరే మిమ్మల్ని తమ గ్రూప్ లో యాడ్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ మీకు ఇప్పుడు కొన్ని కొత్త ఎంపికలు కనిపిస్తాయి, కాబట్టి వాటిలో నుండి మీకు కావల్సిన వాటిని ఎంచుకోవచ్చు.
ఇందులో My Contacts ని ఎంచుకున్నట్లయితే, కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు మాత్రమే మిమ్మల్ని Group లో Add చేసుకునేలా ఉంటుంది. ఇక మరొక ఎంపిక అయినటువంటి, MyContacts Except ని ఎంచుకుంటే, మీరూ ఎవరైతే మిమ్మల్ని గ్రూప్ లో Add చేసే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో, వారు మాత్రమే మిమ్మల్ని Add చేసుకునేలా చేస్తుంది. ఇక ఇతరులు ఎవరూ కూడా మిమ్మల్ని Add చేసే అవకాశం ఉండదు.