మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ తెచ్చే పనిలో పడింది. యూజర్లకు ఇప్పటికే చాలా ఉపయోగకరమైన ఫీచర్లను అందించిన వాట్సాప్, ఇప్పుడు WhatsApp AI Profile పిక్చర్ ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ అనుభూతిని మరింత పెరుగుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉంది.
వాట్సాప్ AI ప్రొఫైల్ పిక్చర్ క్రియేషన్ కోసం AI Profile Photo ఫీచర్ ను అందించే పనిలో వాట్సాప్ ఉన్నట్లు WABetainfo తెలిపింది. ఈ ఫీచర్ తో యూజర్లు వారి ప్రొఫైల్ పిక్చర్ ను AI ద్వారా ఎన్ హెన్స్ చేసుకునే అవకాశం ఉంటుందని ఈ రిపోర్ట్ తెలిపింది.
ఈ అప్ కమింగ్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉందని, అప్ కమింగ్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుతుందని కూడా ఈ నివేదిక తెలియచేసింది. అంతేకాదు, ఇది ఇంకా బీటా టెస్టర్స్ కోసం కూడా అందుబాటులోకి రాలేదని కూడా తెలిపింది.
Also Read: Vivo X Fold 3 Pro లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!
ముందుగా బీటా టెస్టర్స్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చిన క్రియేట్ అండ్ షేర్ AI Stickers ఫీచర్ కొనసాగింపుగా ఈ కొత్త ఫీచర్ గా వస్తోంది. ముందుగా వచ్చిన ఈ ఫీచర్ ద్వారా AI స్టిక్కర్ లను క్రియేట్ చేసి షేర్ చేసే వీలుంది. అయితే, రానున్న అప్ కమింగ్ ఫీచర్ ద్వారా ప్రొఫైల్ పిక్చర్ ను క్రియేట్ చేసుకునే వీలుంటుంది.
ఈ ఫీచర్ ఎలా ఉంటుందో తెలియజేసే స్క్రీన్ షాట్ ను కూడా వాబీటాఇన్ఫో షేర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ద్వారా ఈ ఫీచర్ ఎలా ఉంటుందో తెలియ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ను క్రింద చూడవచ్చు.
ఈ స్క్రీన్ షాట్ ద్వారా, యూజర్ కు నచ్చిన విధంగా ప్రాంప్ట్ లేదా గుర్తులు అందించడం ద్వారా యూనిక్ AI ప్రొఫైల్ పిక్చర్ ను నేరుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ తన నిజమైన ఫోటోలు షేర్ చేయకుండా ఈ AI ఇమేజ్ లను ప్రొఫైల్ ఫోటోలుగా ఎంచుకోవచ్చు. తద్వారా, యూజర్ ప్రైవసీ మరింత పటిష్టం అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది.
ఈ అప్ కమింగ్ ఫీచర్ అప్ వాట్సాప్ అప్డేట్స్ ద్వారా అందుకునే అవకాశం ఉండవచ్చు, అని కూడా తెలిపింది.