వాట్స్ అప్ అప్ డేట్: text formatting ఫీచర్స్ అండ్ ఫైల్ షేరింగ్ ఇంప్రూవ్డ్ ఆప్షన్స్
వాట్స్ అప్ కొత్త అప్ డేట్ లో text formatting మరియు ఫైల్ షేరింగ్ ఇంప్రూవ్డ్ ఫీచర్స్ ను యాడ్ చేసింది. text formatting అంటే ఇక మెసేజెస్ ను బోల్డ్ మరియు ఇటాలిక్స్ లో పంపగలరు.
text formatting ఫీచర్ వెర్షన్ 2.12.535 లో ఉంది. కాని ప్లే స్టోర్ లో 2.12.510 వెర్షన్ ఉంది. అయితే ఈ లింక్ లో 2.12.535 వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. Text ను బోల్డ్ గా పంపాలంటే రెండు asterisks మధ్యన టైప్ చేయాలి.
ఫర్ eg – *TYPE YOUR TEXT BETWEEN HERE*. అలాగే ఇటాలిక్స్ లో text పంపాలనుకుంటే రెండు underscores మధ్యన text వ్రాయాలి. ఫర్ eg – _TYPE YOUR TEXT BETWEEN HERE_
మెసేజ్ రిసీవర్ కు కూడా అదే సపోర్ట్ వెర్షన్ నంబర్ ఉంటే వాళ్లకు కనిపిస్తుంది బోల్డ్ అండ్ ఇటాలిక్స్ text. అలగే ఆల్రెడీ pdf ఫైల్స్ ను పంపేందుకు సపోర్ట్ చేస్తుంది కదా వాట్స్ అప్…
అయితే అది కేవలం ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్న ఫైల్స్ ను మాత్రమే send చేసేది, ఇప్పుడు గూగల్ డ్రైవ్, మైక్రో సాఫ్ట్ one డ్రైవ్ అకౌంట్స్ నుండి కూడా పంపగలరు.అంతేకాదు గూగల్ డ్రైవ్ నుండి docs, షీట్స్ మరియు స్లైడ్స్ కూడా send చేయగలరు. అయితే ఇవి ఆటోమేటిక్ గా pdf గా కన్వర్ట్ అయ్యి send అవుతాయి.
గమనిక :వాట్స్ అప్ అఫిషియల్ వెబ్ సైట్ లో 2.12.539 లేటెస్ట్ వెర్షన్ ఉంది కాని దీనిలో ఈ ఫీచర్స్ లేవు. కంపెని 17 వ తారీఖున మూడు ( 2.12.529, 2.12.534, 2.12.535 ) అప్ డేట్స్ రిలీజ్ చేసింది. మరలా 18 న కొన్ని అప్ డేట్స్( 2.12.536, 2.12.537, 2.12.539 ) రిలీజ్ చేసింది.
మీరు ఒకవేళ అఫిషియల్ సైట్ నుండి 539 వెర్షన్ ఇంస్టాల్ చేసుకుంటే మళ్ళీ 535 ఇంస్టాల్ చేసినప్పుడు ఇంస్టాల్ అవ్వదు యాప్. సో లేటెస్ట్ వెర్షన్ 539 ను ఇంస్టాల్ చేసేస్తే, ముందు దానిని uninstall చేసి 535 వెర్షన్ ఇంస్టాల్ చేయాలి పైన ఉన్న ఫీచర్స్ కావాలని అనుకుంటే.