WhatsApp లో అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చింది..ఏమిటా New ఫీచర్ అంటే.!
Whatsapp లో అద్భుతమైన New సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకు వచ్చింది
యూజర్ల సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం మరొక కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది
ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు వారిని ఎవరు ట్రాక్ చెయ్యకుండా నిలువరించవచ్చు
ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ Whatsapp లో అద్భుతమైన New సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఉపయోగకరమైన ఫీచర్లను తన యూజర్ల కోసం అందించిన వాట్సాప్, యూజర్ల సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం మరొక కొత్త ఫీచర్ ను కూడా కొత్తగా తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు వారిని ఎవరు ట్రాక్ చెయ్యకుండా నిలువరించవచ్చు.
WhatsApp New Feature
ఇటీవల కాల్స్ సెక్యూరిటీ కోసం Silence Unknown Callers వంటి మంచి సేఫ్టీ ఫీచర్ ను తీసుకు వచ్చిన వాట్సాప్, ఇప్పుడు కొత్తగా IP Address ప్రొటెక్ట్ ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ యూజర్లు వారి IP అడ్రెస్స్ ను ఎవ్వరూ చూడకుండా కట్టి చేసుకొవచ్చు. ఇది నిజంగా యూజర్ల సెక్యూరిటీ కోసం చాలా ఉపయోగకరమైన మరియు అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు.
ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ ను ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ ను మీ ఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలి? అంటే, ఈ ఫోన్ లోని వాట్సాప్ ను ఓపెన్ చేసి కుడివైపు మూలన కనిపించే హ్యాంబర్గ్ (మూడు చుక్కలు) పైన నొక్కండి. ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్ లలో సెట్టింగ్స్ లోకి వెళ్లి Protect IP Address In Calls అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.
Also Read : త్వరలోనే Jio 5G టారిఫ్ రేట్లు పెరుగనున్నాయా..జియో ఏమంటోంది | New Update
ఎవరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులో వుంది?
ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే చాలా మందికి అందుబాటులోకి వచ్చింది మరియు త్వరలోనే మీ ఫోన్ లో కూడా మీరు అందుకుంటారు. ప్రస్తుతానికి మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ అందకపోయినా త్వరలోనే అందుకుంటాని భావించాలి.
ఈ కొత్త IP ప్రొటెక్షన్ ఫీచర్ వల్ల ఉపయోగం ఏమిటి?
ఇక ఈ కొత్త IP ప్రొటెక్షన్ ఫీచర్ వల్ల ఉపయోగం ఏమిటి? అని చూస్తే, ఈ ఫీచర్ ను ఎంచుకోవడం ద్వారా వాట్సాప్ కాల్స్ ద్వారా మిమల్ని ట్రాక్ చేయాలని చూసేవారి కొత్త వ్యక్తులను నిలువరించవచ్చు. అంటే, ఇతరులు వాట్సాప్ ద్వారా మిమ్మల్ని ట్రాక్ చెయ్యడం వెలుపడకుండా చేస్తుంది ఈ కొత్త వాట్సాప్ ఫీచర్.