WhatsApp తన వినియోగదారులకు క్రొత్త ఫీచర్స్ ని ఇస్తుంది . Whatsapp ఇటీవలే తన వినియోగదారుల కోసం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ ని విడుదల చేసింది, దీనిలో వినియోగదారులు పంపిన మెసేజెస్ ను తొలగించవచ్చు.మొదటి డిలీట్ చేయవలిసిన మెసేజ్ కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉంది, ఇటీవల కంపెనీ 68 నిమిషాల మరియు 16 సెకన్లకు పెంచింది .
డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ టైం వాలిడిటీ ని పెంచడం ద్వారా, కొందరు వినియోగదారులు కూడా మూడు సంవత్సరాల క్రితం మెసేజెస్ ను కూడా తీసివేస్తున్నారు. ఈ ఫీచర్ ని దుర్వినియోగం చేయకుండా నివారించడానికి, కంపెనీ మరోసారి Whatsapp అప్డేట్ ద్వారా "బ్లాక్ రివోక్ రిక్వెస్ట్ " ఫీచర్ ని తెస్తోంది.
వాట్స్ యాప్ అప్డేట్ న్యూస్ అందించే వెబ్సైట్ WaBetaInfo నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ కొత్త ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ మిస్ యూజ్ ని ఆపుతుంది . బ్లాక్ రివోక్ రిక్వెస్ట్ ఫీచర్ లో, వినియోగదారుడు ఒక మెసేజ్ ని డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేసినప్పుడు , రిసీవర్ ని నోటిఫికేషన్ ద్వారా అలెర్ట్ చేస్తుంది .