WhatsApp లో కొత్తగా కస్టమైజ్ చాట్ థీమ్స్ ని 20 రంగుల్లో పరిచయం చేసింది.!
WhatsApp లో కొత్తగా కస్టమైజ్ చాట్ థీమ్స్ ని 20 రంగుల్లో పరిచయం చేసింది
యూజర్లు వారి చాట్ థీమ్ ను నచ్చిన కలర్ లో కస్టమైజ్ చేసుకునే అవకాశం అందించింది
ఈ ఫీచర్ తో చాట్స్ కోసం కోరుకునే కలర్ ను విడివిడిగా ఎంచుకునే అవకాశం వుంది
WhatsApp లో కొత్తగా కస్టమైజ్ చాట్ థీమ్స్ ని 20 రంగుల్లో పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు వారి చాట్ థీమ్ ను నచ్చిన కలర్ లో కస్టమైజ్ చేసుకునే అవకాశం అందించింది. ఇప్పటికే తన యూజర్స్ కోసం చాలా ఫీచర్స్ ను పరిచయం చేసిన వాట్సాప్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ను కూడా పరిచయం చేస్తోంది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే చాట్స్ కోసం కోరుకునే కలర్ ను విడివిడిగా ఎంచుకునే అవకాశం వుంది.
WhatsApp New Feature
వాట్సాప్ అప్డేట్స్ మరియు అప్ కమింగ్ ఫీచర్స్ గురించి అందరి కంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అందించే wabetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాబీటాఇన్ఫో X అకౌంట్ నుంచి ఈ విషయాన్ని గురించి స్క్రీన్ షాట్ తో సహా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం, వాట్సాప్ లో 20 కలర్ ఆప్షన్ లతో చాట్ థీమ్ ను కస్టమైజ్ చేసుకునే ఫీచర్ ను అందించింది.
ఈ కొత్త ఫీచర్ ను ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు అది కూడా బీట్ టెస్టర్స్ కోసం గూగుల్ స్టోర్ లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ను అందుకున్న యూజర్లు టెస్ట్ చేసి వారి రివ్యూలను అందించవచ్చు.
ఈ ఫీచర్ తో చాట్ నచ్చిన కలర్ తో చాట్ థీమ్ ను సెట్ చేసుకొని రంగురంగుల థీమ్స్ లో చాట్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్ళి చాట్స్ ట్యాబ్ ను ఎంచుకుని అందులో డిఫాల్ట్ చాట్ థీమ్ లో ఉన్న Side by Side టోగుల్ ను ఆన్ చేయాలి.
Also Read: బిగ్ డీల్ : 18 వేలకే Apple iPad అందుకోండి అంటున్న Flipkart
ఈ ఫీచర్ ను అందుకోవాలంటే వాట్సాప్ అప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.24.21.34 వెర్షన్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే, ఈ ఫీచర్ ను లిమిటెడ్ మెంబర్స్ కోసం మాత్రమే టెస్టింగ్ కోసం ఆఫర్ చేస్తుంది. కాబట్టి, ఈ ఫీచర్ కోసం మీ అకౌంట్ అర్హత పొంది ఉండాలి. ఒకవేళ మీ అకౌంట్ అర్హత పొందక పొతే మీకు ఈ ఫీచర్ కనిపించదు.