Whatsapp New ఫీచర్: వాట్సాప్ లో మరోక ఉపయోగకరమైన ఫీచర్.!
వాట్సాప్ ఇప్పుడు Whatsapp New ఫీచర్ ను తీసుకు వస్తోంది
యూజర్ల ప్రైవసీ మరియు సెక్యూరిటీలకు పెద్ద పీట వేసే వాట్సాప్
ఈ కొత్త ఫీచర్ తో మరింత ఆకట్టుకుంటుంది
యూజర్ల ప్రైవసీ మరియు సెక్యూరిటీలకు పెద్ద పీట వేసే వాట్సాప్ ఇప్పుడు Whatsapp New ఫీచర్ ను తీసుకు వస్తోంది. ఇప్పటికే వాట్సాప్ బీటా యూజర్ల కోసం ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కూడా చెబుతోంది. యూజర్ సెక్యురిటీ మరియు ప్రైవసీని మరింతా పెంచడానికి ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లను తీసుకు వస్తున్న వాట్సాప్, ఈ కొత్త ఫీచర్ తో మరింత ఆకట్టుకుంటుంది.
Whatsapp New ఏమిటి?
వాట్సాప్ కొత్తగా తీసుకు వచ్చిన ఆ కొత్త ఫీచర్ ఏమిటా, అని మీరు అనుకుంటున్నారా? ముందుగా వాట్సాప్ ఫోటోలు మరియు వీడియోల ప్రైవసీ కోసం తీసుకు వచ్చిన ‘View Once’ ఫీచర్ ను ఇప్పుడు ‘Voice Message’ ల కోసం కూడా అందించింది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసిన ఫోటో మరియు వీడియోలు కేవలం ఒక్కసారి మాత్రమే చూసే వీలుంటుంది మరియు స్క్రీన్ షాట్ తీసే అవకాశం కూడా ఉండదు.
ఈ ఫీచర్ తో యూజర్ల ఫోటోలు మరియు వీడియోలు చాలా సెక్యూర్ గా ఉంటాయి. అందుకే, వాట్సాప్ ఇప్పడు వాయిస్ మెసేజిలకు కూడా ఈ కొత్త ‘వ్యూ వన్స్’ ఫీచర్ ను ఆపాదించింది.
ఈ విషయం గురించి WABetaInfo వివరాలను తన ట్విట్టర్ అకౌంట్ నుండి స్క్రీన్ షాట్ తో సహా పంచుకుంది. దీని ప్రకారం, ఈ కొత్త ఫీచర్ iOS మరియు Android beta యూజర్ల కోసం అందుబాటులో వుంది. యూజర్లకు మరింత ప్రైవసీ అందించాడని ఈ కొత్త ఫీచర్ ను జత చేస్తున్నట్లు కూడా చెబుతోంది.
Also Read : Amazon GIF Sale ఆఫర్ చేస్తున్న టాప్ Smart Tv ఆఫర్.!
ఈ కొత్త ఫీచర్ ను ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ కొత్త వ్యూ వన్స్ వాయిస్ ఫీచర్ ను సెట్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ ఫీచర్ కోసం మీరు వాయిస్ రికార్డ్ కోసం View Once ఆప్షన్ ను ఎంచుకుంటే సరిపుతుంది. అంతే, మీరు పంపించే వాయిస్ మెసేజ్ కేవలం ఒక్కసారి మాత్రమే అవతలి వారికి వినే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఇదే నెలలో మరిన్ని కొత్త ఫీచర్ లను తీసుకువచ్చే పనిలో వాట్సాప్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. యూజర్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ కోసం వాట్సాప్ లో ఇంకా ఎన్ని కొత్త ఫీచర్లు వస్తాయో చూడాలి.