WhatsApp లో మరొక అద్భుతమైన ఫీచర్ తెచ్చింది.!
WhatsApp రోజు రోజుకు తన పరిధులను మరింతగా పెంచుతోంది
WhatsApp ఇప్పుడు మరొక అద్భుతమైన ఫీచర్ తెచ్చింది
View once ఫీచర్ ను ఇప్పుడు వాయిస్ మెసేజీలకు కూడా జత చేసినట్లు తెలిపింది
ప్రపంచ దిగ్గజ ఇన్స్టాంట్ మెసేజ్ యాప్ WhatsApp రోజు రోజుకు తన పరిధులను మరింతగా పెంచుతోంది. అంతేకాదు, యూజర్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ని మరింత పటిష్టంగా చెయ్యడానికి మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకు వస్తోంది. యూజర్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ అంశాన్ని ప్రధానంగా తీసుకునే WhatsApp ఇప్పుడు మరొక అద్భుతమైన ఫీచర్ తెచ్చింది. ముందుగా ఫోటోలను చాలా సెక్యూర్ గా చేసేలా ఫోటో సెండ్ కోసం తీసుకు వచ్చిన View once ఫీచర్ ను ఇప్పుడు వాయిస్ మెసేజీలకు కూడా జత చేసినట్లు తెలిపింది.
ఏమిటా WhatsApp కొత్త ఫీచర్?
వాట్సాప్ లో ఇతరులకు పంపించే ఫోటోలను ఇతరులకు ఫార్వార్డ్ చేసే లేదా డౌన్ లోడ్ చేసుకొనే వీలు లేకుండా ఒక్కసారి మాత్రమే చూడగలిగేలా వ్యూఒన్స్ ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల ప్రైవసీని మరింతగా మెరుగు పరచింది. ఇదే దారిలో యూజర్ సెక్యూరిటీ మరియు ప్రైవసీని ఇంకా పటిష్టం చేయడానికి వీలుగా ఈ వ్యూఒన్స్ ఆప్షన్ ను వాయిస్ మెసేజిలకు కూడా జత చేసింది.
Also Read : Flipkart Big Year End Sale: భారీ ఆఫర్లతో రేపటి నుండి మోదలవుతుంది.!
ఏమిటి ఈ కొత్త ఫీచర్ వలన ప్రయోజనం?
ఏమిటి ఈ కొత్త ఫీచర్ వలన ప్రయోజనం అంటే, ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు పంపించే వాయిస్ మెసేజిలను ఇతరులకు ఫార్వార్డ్ చేసే అవకాశం ఉండదు. మీరు వ్యూవన్స్ ఆప్షన్ ద్వారా పంపించే వాయిస్ మెసేజిలను కేవలం ఒక్కసారి మాత్రమే వినగలిగే అవకాశం ఉంటుంది.
ముందుగా ఫోటోలు మరియు వీడియోల సెండ్ లో కనిపించే వన్-టైమ్ ఆప్షన్ ఇప్పుడు వాయిస్ మెసేజిలకు సెండ్ కోసం కూడా ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ వాయిస్ మెసేజిల మాదిరిగానే రికార్డ్ చేసి పంపించవచ్చు. అయితే, ఇక్కడ మీరు వన్-టైమ్ ఆప్షన్ ను ముందుగా ఎంచుకోవలసి ఉంటుందని వాట్సాప్ తెలిపింది.